Begin typing your search above and press return to search.
బ్రస్సెల్స్ లో భారతీయుడు మరణించాడు
By: Tupaki Desk | 29 March 2016 10:08 AM ISTప్రపంచాన్ని షాక్ తినేలా చేసిన బెల్జియం రాజధాని బ్రసెల్స్ వరుస బాంబుపేలుళ్ల మృతుల్లో మనోడు చేరాడు. 35 మంది మరణానికి కారణమైన ఈ బాంబు పేలుళ్ల వ్యవహారంలో భారతీయులు ఎవరూ లేరని ప్రకటించినప్పటికీ.. బాంబుపేలుళ్లు చోటు చేసుకున్న రోజు నుంచి అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి మృత్యువాత పడినట్లు అధికారులు తాజాగా గుర్తించారు.
బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్ర గణేశన్.. బాంబుపేలుళ్లు జరిగిన రోజు నుంచి ఆయన కనిపించటం లేదు. నాలుగేళ్లుగా బ్రసెల్స్ లో పని చేస్తున్న గణేశన్ కుటుంబం గత నెలలోనే బెంగళూరుకు వచ్చి వెళ్లింది.వారం కిందట చోటు చేసుకున్న పేలుళ్లలో గణేశన్ మిస్ కావటం.. ఆయన గురించి ఆరా తీసిన అధికారులు తాజాగా ఆయన మృతి చెందినట్లు కన్ఫర్మ్ చేశారు.
గణేశన్ మృతదేహాన్ని భారత్ కు పంపుతున్నామని.. ఆయన కుటుంబానికి తాము సానుభూతి తెలుపుతున్నట్లుగా బెల్జియం అధికారులు చెబుతున్నారు. బ్రసెల్స్ బాంబుపేలుళ్ల బాధితుల్లో మనోళ్లు ఎవరూ లేరని అనుకున్నా.. అందుకు భిన్నంగా మనోడు ఒకడు మరణించటం విషాదానికి గురి చేస్తోంది.