Begin typing your search above and press return to search.
అమెరికాలో మనవాళ్ల ఉద్యోగాలకు ఎసరు!
By: Tupaki Desk | 3 Sept 2020 11:15 AM ISTట్రంప్ విధించిన నిబంధనలతో ఆమెరికాలో మనవాళ్ల ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు కొత్తగా ఉద్యోగాలు వెతుక్కొనేవారికి చిక్కులు వచ్చిపడ్డాయి. తాజాగా భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఓ సంచలన ప్రకటన చేసింది. తమ కంపెనీలో ఈ రెండేళ్లలో 12 వేల అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇందుకోసం ఇప్పటికే గైడ్లైన్స్ సిద్ధం చేశామని ఆ కంపెనీ ప్రకటించింది. ఇందుకు కారణం ట్రంప్ సర్కార్ విధించిన నిబంధనలే. ఐదేళ్లలో ప్రతి కంపెనీ 25 వేలమంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలని ట్రంప్ సర్కార్ సూచించింది. దీంతో ఆయా కంపెనీలు చర్యలు ఉపక్రమించాయి.
ట్రంప్ నిర్ణయం భారత ఐటీనిపుణులకు శాపంగా మారింది. ఒకవేళ ట్రంప్ సర్కార్ కొత్తనిబంధనలు విధించకపోయి ఉంటే ఆ ఉద్యోగాలన్నీ భారతీయులకే సొంతమయ్యేవని నిపుణులు భావిస్తున్నారు. హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని పలు కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇన్ఫోసిస్ లో ఇప్పటికీ 2.39 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా ఇన్పోసిస్ కొత్త ఉద్యోగులను భారీగా ఆపాయింట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్న ఇన్పోసిస్ నిర్ణయం భారతీయ ఐటీ ఉద్యోగులకు మింగుడు పడని నిర్ణయమే.