Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయాలి..! ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Nov 2020 8:40 PM IST
కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయాలి..! ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు
X
దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ పంపిణీ చేయాలని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి డిమాండ్​ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​లు మెరుగైన పనితీరు కనబరుస్తున్న ప్రస్తుత తరుణంలో నారాయణమూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోడెర్నా, ఫైజర్ తదితర ఫార్మా సంస్థలు రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​లో మెరుగైన ఫలితాలు కనబరుస్తున్నాయి. దీంతో త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. దాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ కరోనా వ్యాక్సినేషన్ ప్రజలందరికీ ఉచితంగా చేయించాలి. ఈ భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్లను ఉచితంగా వేయించాలి. వ్యాక్సిన్లను ఉత్పత్తికయ్యే ఖర్చును ఐక్యరాజ్య సమితి లేదా దేశాలు చెల్లించాలి. ఈ సంస్థలు భారీ లాభాలు ఆశించొద్దు. బీహార్ ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది.’ అని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. మరోవైపు వ్యాక్సిన్​ ధరలో మెజార్టీ భాగాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలు భరించాలని కోరారు.

మోడెర్నా, ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్లను రెండు డోసుల్లో ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది.
‘కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం తాత్కాలికంగా ఇంట్లో నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. కానీ మన దేశంలోని చాలా ఇళ్లు చిన్నవి కాబట్టి ఇంటి వద్ద పనిపై శ్రద్ధ పెట్టడం కష్టం అవుతుంది’ అని నారాయణ మూర్తి తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్​ ఎంత ధరకు అందుబాటులో ఉంటుంది. పేద ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందా? లేదా అన్న విషయం సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాశం అయింది. ఈ నేపథ్యంలో నారాయణమూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.