Begin typing your search above and press return to search.
షీనా బోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ వింత కోరిక
By: Tupaki Desk | 23 Dec 2020 5:05 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణీ ముఖర్జీ తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. 2012 ఏప్రిల్ 23 న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురైంది. 2015 లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఇంద్రాణి డ్రైవర్ అప్రూవర్‌గా మారి ఉన్న విషయం చెప్పడంతో పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం జైలులో ఉన్న షీనా బోరా హత్య కేసు ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ వింత కోరిక కోరారు. ఖైదీలు ధరించే యూనిఫాం (పచ్చ చీర) తాను కట్టుకోనని సీబీఐకి అర్జీ పెట్టుకున్నారు. ఈ చీర కట్టుకోనని.. దీనికి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ ఆమె సీబీఐకి అర్జీ పెట్టుకున్నారు.
షీనాబోరా హత్యకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోందని.. దోషిగా తేలలేదని.. అయినా ఖైదీలు ధరించే యూనిఫాంను ధరించమని జైలు అధికారులు అడుగుతున్నారని ముఖర్జీ ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు దీనిపై వెంటనే సమాధానం దాఖలు చేయాలని బైకుల్లా జైలును కోర్టు కోరింది.