Begin typing your search above and press return to search.
చదువుకున్న స్కూల్ కి రూ.334 కోట్లు ఇచ్చేసింది
By: Tupaki Desk | 14 Jan 2016 10:52 AM ISTప్రవాస భారతీయురాలిగా.. పెప్సీకో సీఈవో సుపరిచితురాలైన ఇంద్రానూయి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు దాటిన ఆమె.. తాజాగా తీసుకున్న వ్యక్తిగత నిర్ణయంతో ఈసారి వార్తల్లో నిలిచారు. తాను చదువుకున్న స్కూల్ (యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్) కు రూ.334కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రపంచంలో ప్రఖ్యాత మేనేజ్ మెంట్ స్కూళ్లలో ఒకటిగా పేరున్న యేల్ కి ఇంత భారీ మొత్తంలో విరాళాన్ని గతంలో ఎవరూ ఇవ్వలేరని చెబుతున్నారు.
ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం యేల్ కు ఇంద్రానూయి ఇచ్చిన విరాళం రూ.334 కోట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో అది మరింత ఎక్కువన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇంత భారీ మొత్తాన్ని తమకు అందజేయాలన్న నిర్ణయం తీసుకున్న ఇంద్రా నూయిని యేల్ స్కూల్ అరుదైన గౌరవాన్ని అందించింది. స్కూల్ డీన్ షిప్ ను ఇంద్రాయూయి గౌరవార్థం ప్రకటించింది. ఒక ప్రముఖ బిజినెస్ స్కూల్ కి డీన్ షిఫ్ పొందిన తొలి మహిళగా ఇంద్రా రికార్డు సృష్టించటం గమనార్హం.