Begin typing your search above and press return to search.

ఎమర్జెన్సీలో కోటలో కొల్లగొట్టిన ఆ 5వేల కోట్లు ఏమయ్యాయి..

By:  Tupaki Desk   |   14 May 2018 3:30 PM GMT
ఎమర్జెన్సీలో కోటలో కొల్లగొట్టిన ఆ 5వేల కోట్లు ఏమయ్యాయి..
X
రాజులు, రాజ్యాలు పోయాయి. వారి సంపద హరించుకుపోయింది. భారత్ లోని కలికితురాయి కోహినూర్ వజ్రం బ్రిటీషర్ల పరమైంది. ఇదేకాదు.. అప్పట్లోనే భారత జాతీయ సంపదను నాటి ముస్లిం చక్రవర్తులు, ఆ తర్వాత బ్రిటీషర్లు ఊడ్చుకుపోయారు.. అయితే ఎంతో సంపద ఇంకా మన రాజులు కట్టించిన కోటలు - గదులు - దేవాలయాల్లో నిక్షిప్తమై ఉందనేది పరిశోధకుల వాదన... ఆ కోవలోనే కేరళలోని ఆనంతపద్మనాభస్వామి దేవాలయంలోని మడిగెలను తీసి చూడగా.. అనంత సంపద బయటపడింది. వేల కోట్ల విలువైన బంగారం - ఆభరణాలు - విగ్రహాలు వెలుగుచూశాయి.

ఇప్పటికీ వెలుగుచూడని సంపద దేశంలో కాలగర్భంలో ఉందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జైగడ్ కోటలో తరగని నిధి ఉందని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. ఈ విషయం తెలిసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రహస్య ఆపరేషన్ ను నిర్వహించారట.. 1976లో ఎమర్జెన్సీ సమయంలో ఇన్ కంట్యాక్స్ లో పనిచేస్తున్న గాయత్రీ అని అధికారిని జైగడ్ కోటకు పంపి కోటలోని నీటికొలను - శివాలయం పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపించిందని.. అక్కడి సంపదను ట్రాఫిక్ కట్టడి చేసి మరీ ఢిల్లీ తరలించిందని అప్పట్లో ఓ ఇంగ్లీష్ పత్రిక కథనం ప్రచురించింది. దాదాపు 5వేల కోట్ల విలువైన ఈ సంపద ఏమైందన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై అధికారిక సమాచారం కూడా లేదు.

ఇలా రాజుల సొమ్ము రాళ్లపాలవుతుందనే సామెత దేశంలో నిజమైంది. కనిపెట్టని కోట్ల విలువైన సంపద ఇంకా కాలగర్భంలోనే ఉంది. వాటిని తీయడానికి మన ప్రభుత్వాలకు ధైర్యం చాలడం లేదు. ఆధ్యాత్మిక ముసుగులో దేవాలయాలను తవ్వలేక సంపదను అలానే మరుగునపడేస్తున్నారు. ఈ జాతి సంపద వెలికి తీస్తే దేశంలోని పేదరికన్నంతా ప్రారదోలవచ్చు.