Begin typing your search above and press return to search.

130 కోట్లు ఉన్నా ఇండియా పరిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   3 Sept 2020 8:30 PM IST
130 కోట్లు ఉన్నా ఇండియా పరిస్థితి ఏంటి?
X
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో రెండోస్థానంలో భారత్ ఉంది. ఏకంగా 130 కోట్ల మంది ఈ సువిశాల భారతంలో బతుకుతున్నారు. ఇలాంటి దేశంలో కరోనా కేసులు కూడా అంతే జెట్ స్పీడుగా నమోదవుతున్నాయి.

130 కోట్లు ఉన్న భారత్ లో అన్ లాక్ -4 తర్వాత ఏంటి పరిస్థితి అని చూస్తే.. కరోనాను అందరూ లైట్ గా తీసుకున్నారు. అదో జలుబు మాదిరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని ఆపడం లేదు. కరోనా వచ్చినా భయపడడం లేదు. చాలా మంది లో కరోనా వచ్చిపోయింది కూడా..

2018 డిసెంబర్ 31 నాటికి దేశ జనాభా 130.28 కోట్లు దాటిపోయినట్లు జనగణన విభాగం వెల్లడించింది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన జనన, మరణాల సంఖ్య ఆధారంగా తాజా జనాభా లెక్కలను విడుదల చేసింది.

2018లో 2.60 కోట్ల మంది శిశువులు దేశంలో పుట్టారు. 80.77 లక్షల మంది చనిపోగా.. జనన మరణాలను లెక్కిస్తే నికరంగా 1.79 కోట్ల జనాభా అదనంగా పెరిగింది. ఇక పుట్టిన 6 నెలల్లోనే లక్షా 74మంది పిల్లలు చనిపోతున్నారు.

సహజంగానే దేశంలో పిల్లలు పెద్దలు లక్షల్లో చనిపోతున్నారు. అలాంటిది ఈ మహమ్మారి పట్ల నిర్లక్ష్యం ఇంకా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే దేశం కరోనా మయం కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.