Begin typing your search above and press return to search.

అమెరికాకు క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 8:20 AM GMT
అమెరికాకు క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు..!
X
కరోనా మహ్మమారి ఎంట్రీతో అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్లుగా విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఇక విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకున్న భారతీయులు ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కాగా గతేడాది కాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ కారణంగా విదేశాల్లో పరిస్థితులు మళ్లీ మామూలుగా మారాయి.

దీంతో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయులు తహతహలాడుతున్నారు. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలోనే భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో చదువును కొనసాగించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా.. కెనడా.. బ్రిటన్.. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వారంతా ఆసక్తి కనబరుస్తున్నారు.

గత కొన్నేళ్లతో పొలిస్తే 2022లోనే అమెరికా భారతీయ విద్యార్థులకు అత్యధికంగా వీసాలు మంజూరు చేసినట్లు తాజాగా వెల్లడించారు. 2016 తర్వాత ఒక ఏడాదిలో భారతీయ విద్యార్థులకు 1.25లక్షలు జారీ చేయడం 2022 సంవత్సరంలోనే జరిగిందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ఫ్రైస్ తెలిపారు.

అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 20 శాతంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు గత కొన్ని నెలలుగా భారత్ సహా పలు దేశాలకు సంబంధించిన వీసాల మంజూరు పెండింగ్ లో పడిందన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ వీసాలను పరిష్కరించడంతో పాటు ఇంటర్వ్యూ వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు నెడ్ ఫఫ్రైస్ వివరించారు.

వీసాల జారీ కోసం కొత్త ఉద్యోగులను సైతం నియమించినట్లు తెలిపారు. దీంతో పెండింగ్ వీసా మంజూరు ప్రక్రియ త్వరితంగా జరుగుతుందన్నారు. ఈ ఏడాదిలోగా కోవిడ్ ముందు నాటి స్థితికి వీసాల ప్రక్రియ చేరుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం అన్ని దేశాలు కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో అమెరికా వీసాలకు మళ్లీ ఫుల్ డిమాండ్ పెరిగిందని ఆయన వెల్లడించారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.