Begin typing your search above and press return to search.

విదేశీ రికార్డు మనకే సొంతం

By:  Tupaki Desk   |   20 Dec 2015 5:40 AM GMT
విదేశీ రికార్డు మనకే సొంతం
X
కరవుతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లటం.. భారత్ లో చాలా కామన్ గా కనిపించే వ్యవహారం. కేవలం కరవుతోనే కాదు.. మెరుగైన జీవన ప్రమాణం కోసం.. మంచి అవకాశాల కోసం విదేశాలకు పయనమయ్యే వారి సంఖ్య భారతీయులు ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు.. విదేశాల్లో నివసించే దేశీయుల్లో భారతీయులే ఎక్కువన్న రికార్డును సొంతం చేసుకోవటం విశేషం. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వలస వెళుతున్న వారికి సంబంధించిన వివరాల్ని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలవటం గమనార్హం.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున వివిధ దేశాలకు వలస వెళ్లటం కనిపిస్తుంది. మెరుగైన జీవనం కోసం ఇలా వలసలు వెళ్లిన వారు ప్రపంచం వ్యాప్తంగా 24.4 కోట్ల మంది ఉండటం గమనార్హం. ఇలా వలసలు వెళ్లే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. 2015తో పోలిస్తే 2000లో వలసలతో వేర్వేరు దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య 40 శాతం తక్కువగా ఉందని తేల్చారు. ఇక.. వలస వెళ్లిన దేశాలు చూస్తే.. ఆసియా వాసులు వలస వెళ్లటం బాగా పెరిగిందని తేల్చారు.

గడిచిన 15 ఏళ్లలో గరిష్ఠంగా 17 లక్షల చొప్పున ప్రతి ఏటా ఆసియా దేశాల నుంచి వలస వెళుతున్నట్లు గుర్తించారు. ఆసియా తర్వాత వలస వెళ్లే వారిగా యూరోపియన్లను గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భారతీయులే అత్యధికంగా నివసిస్తున్నట్లు తేల్చారు. విదేశాల్లో నివసించే భారతీయుల 1.6కోట్లుగా తేల్చారు. మన తర్వాత మెక్సికో.. రష్యా.. చైనాలు ఉండటం గమనార్హం.