Begin typing your search above and press return to search.

అమెరికా ఇచ్చింది.. మ‌రి బ్రిట‌న్ సంగ‌తేంటి?.. మోడీకి నెటిజ‌న్ల ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   28 Oct 2022 2:30 AM GMT
అమెరికా ఇచ్చింది.. మ‌రి బ్రిట‌న్ సంగ‌తేంటి?.. మోడీకి నెటిజ‌న్ల ప్ర‌శ్న‌
X
భార‌త్‌కు చెందిన దాదాపు 500 ఏళ్లనాటి పురాతన హనుమాన్‌ విగ్రహాన్ని అమెరికా తాజాగా భార‌త్‌కు అప్ప‌గించింది. అమెరికా విదేశాంగ శాఖ వాషింగ్టన్ లోని బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ రూమ్‌లో దీపావళి వేడుకల  కార్యక్రమంలో  మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్కృతులకు సాయం చేయడం ద్వారా తమ ప్రభుత్వం విభిన్న మతాలకు సహకరిస్తోందని ఆయన తెలిపారు. సంస్కృతిని కాపాడేందుకు, దెబ్బతిన్న చారిత్రక భవనాలను రక్షించేందుకు, దొంగతనాలకు గురైనా చారిత్రక సంపదను తిరిగి సంపాదించేందుకు అమెరికా రాయబారులు సహకరిస్తారన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ, భారత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కలిసి 500 ఏళ్ల పురాతనమైన హనుమాన్‌ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. దానిని భారత ప్రభుత్వానికి అప్పగించినట్లు ప్రకటించారు. దీపావళి వంటి వేడుకలను చేసుకొని మతస్వేచ్ఛను తాము చూపిస్తామని బ్లింకెన్‌ తెలిపారు. ఇటీవల అబుదాబిలోని తమ రాయబార కార్యాలయాన్ని రంగోలీతో అలంకరించారని చెప్పారు.

ఎక్క‌డిదీ.. హ‌నుమాన్ విగ్ర‌హం?

త‌మిళ‌నాడులోని ఓ ఆలయంలో 500 ఏళ్లనాటి హనుమాన్‌ విగ్రహాన్ని కొంద‌రు దొంగిలించి అమెరికాలోని క్రిస్టీ ఆక్షన్‌ హౌస్‌కు విక్రయించారు. ఆ సంస్థ దానిని వేలంలో ఉంచగా ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. ఆక్షన్‌ సంస్థకు, ఆస్ట్రేలియాలోని కొనుగోలుదారుడికి ఆ విగ్రహం దొంగిలిం చినట్లు తెలియదు. కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తం చేయడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొనేందుకు పూర్తిగా సహకరించారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆస్ట్రేలియాలో స్వాధీనం చేసుకొన్న ఈ విగ్రహాన్ని అప్పట్లో అమెరికాకు అప్పగించారు. తాజాగా ఇప్పుడు అది భారత్‌కు అప్ప‌గించారు. ఇది త్వ‌ర‌లోనే భార‌త్‌కు చేరనుంది.

మోడీపై ఒత్తిడి

దొంగ‌త‌నానికి గురైన హ‌నుమాన్ విగ్ర‌హం భార‌త్‌కు రానుంద‌ని.. మ‌రి ఇదే త‌ర‌హాలో వెళ్లిపోయిన ఖ‌రీదైన‌ కోహినూర్  వ‌జ్రం మాటేంట‌ని.. ప్ర‌శ్నిస్తున్నా రు. అంతేకాదు.. ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో ప్ర‌ధాని మారిన నేప‌థ్యంలో అయినా.. దీనిని తిరిగి ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు ఏమైనా చేస్తారా?  లేదా? అనే ప్ర‌శ్న‌లు కూడా సంధిస్తున్నారు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.