Begin typing your search above and press return to search.
ప్రసవం కోసం ప్రవాసం
By: Tupaki Desk | 22 Feb 2016 4:00 AM ISTఇటీవల కాలంలో భారతీయ మధ్య తరగతి వర్గాల్లో కొత్త ట్రెండు మొదలైంది... పుట్టబోయే తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కించుకోవడం కోసం వారు తగిన ప్రణాళిక వేసుకుంటున్నారు. అందుకే భార్య గర్భం దాల్చగానే కుటుంబం సహా అమెరికా వెళ్లిపోయి అక్కడే ప్రసవమయ్యేలా చూసుకుంటున్నారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు అక్కడి పౌరసత్వం వస్తుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది.
ఇటీవల కాలంలో ఈ ధోరణి బాగా ఎక్కువైంది. చాలామంది ఇదేతరహాలో కాన్పు కోసం అమెరికా విమానం ఎక్కుతున్నారు. అయితే... దీనిపై కొత్తగా ఓ చర్చ మొదలైంది. ప్రస్తుతం అభివృద్ధి దారిలో పరుగులు తీస్తున్న ఇండియా వచ్చే ఇరవయ్యేళ్లలో అమెరికాతో సమానంగా మారిపోతుందని... అప్పుడు ఇండియాకు, అమెరికకు తేడా ఏముంటుందని అంటున్నారు. ఆమాత్రం కోసం ఇంత ప్రయాస అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇండియా అమెరికాలా అయ్యేసరికి... అమెరికా ఇంకా ముందుకు పోతుందని... రెండు దేశాల మధ్య వ్యత్యాసం ఎప్పటిలానే ఉంటుందని అంటున్నారు.