Begin typing your search above and press return to search.

కరోనా బీర్ వైరస్: ఇండియన్స్ సెర్చ్

By:  Tupaki Desk   |   28 Jan 2020 6:41 AM GMT
కరోనా బీర్ వైరస్: ఇండియన్స్ సెర్చ్
X
కరోనా వైరస్.. చైనా సహా ప్రపంచదేశాలను వణికిస్తున్న మహమ్మారి. జంతువులు, పాముల మాంసం తినడం వల్ల చైనాలోని వుహాన్ సిటీలో మనుషులకు సోకిన ఈ వైరస్ ప్రపంచదేశాలకు విస్తరించి మరణ మృదంగం వాయిస్తోంది. ఒకరి నుంచి మరొకరి వేగంగా వ్యాపిస్తూ ఇప్పటివరకూ 82మంది ఉసురు తీసింది. 2700కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. భారత దేశంలోకి కూడా ఈ కరోనా వైరస్ వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చైనాకు వెళ్లిన కొంతమందికి వైరస్ సోకినట్టు సమాచారం.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయం పట్టుకుంది. బయటికి రావాలంటేనే భయపడి పోతున్నారు. ఈ వైరస్ అంటు వ్యాధి. గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వారికి లక్షణాలు కనిపించవు. దీంతో ఎంతమందికి ఈ వైరస్ బారిన పడ్డారో తెలుసుకోవడం కష్టం. చైనాలో ఎంబీబీఎస్ చేసినరాజస్థాన్ వ్యక్తి ఇండియా కు రాగా అతడికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు తెలిసింది. అతడిని జనసంచారానికి దూరంగా ప్రత్యేక ఆస్పత్రి లో ఉంచి రాజస్థాన్ సర్కారు చికిత్స చేయిస్తోంది.

వైరస్ ప్రపంచాన్ని కబలిస్తుండడంతో ఇప్పుడిది దేశంలో వైరల్ గా మారిందట.. గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతుకులాడే పదాల్లో ‘కరోనా’ వైరస్ ఉందట.. ఇది ఎలా వ్యాపిస్తుంది.? లక్షణాలు ఎలా ఉంటాయి.? ఎలా వ్యాధి తగ్గించుకోవచ్చనే విషయాలపై భారతీయులు శోధిస్తున్నట్టు తెలిసింది. కరోనా వైరస్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, గూగుల్ లో ట్రెండింగ్లో ఉంది.

అయితే కరోనా పేరుతో పాపులర్ అయిన బీర్ ఒకటి ఉంది. దానిపేరు ‘కరోనా బీర్’. దీంతో అందరూ ఈ బీర్ పై ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ కు కరోనా బీర్ కు సంబంధం లేకున్నా గూగుల్ లో కరోనా బీర్ వస్తుండడంతో అది ట్రెండింగ్ అవుతోంది.