Begin typing your search above and press return to search.

అమెరికా లో ఒక్క ఓటుతో అత్యున్నత పదవిలో భారతీయురాలు !

By:  Tupaki Desk   |   24 Jun 2021 7:00 PM IST
అమెరికా లో ఒక్క ఓటుతో అత్యున్నత పదవిలో భారతీయురాలు !
X
అగ్రరాజ్యం అమెరికాలో మరో భారతీయ మూలాలున్న మహిళకి అత్యంత కీలకమైన పదవి లభించింది. తాజాగా ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌ మెంట్‌ (ఓపీఎం)’ విభాగానికి అక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పదవిలో ఉన్నవారు ఇరవై లక్షల మంది అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే హోదాకి చేరుకుంటారు. దాదాపు 20లక్షల మంది అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌ మెంట్‌ (ఓపీఎం) విభాగానికి మహిళా అధినేతగా భారతీయ మూలాలున్న కిరణ్‌ అహూజా ఎన్నికైయ్యారు. 49 ఏళ్ల కిరణ్‌ అహూజాను ఓపీఎం హెడ్‌ గా ఎంపికచేస్తూ అధ్యక్షుడు బైడెన్‌ గతంలోనే నామినేట్‌ చేశారు. అయితే, ఈ నామినేషన్‌ పై సెనేట్‌ లో మంగళవారం హోరాహోరీ ఓటింగ్‌ జరిగింది.

ఓటింగ్‌ లో 50–50 ఓట్లు పడ్డాయి. ఓటింగ్‌ లో 50–50 ఓట్లు పడటంతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. ఉపాధ్యక్షురాలు కిరణ్‌ కు మద్దతుగా ఓటు వేయడంతో కిరణ్‌ పదవి ఖరారైంది. కిరణ్ గతంలో నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలోనూ కిరణ్‌ ఓపీఎంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఒపివో ని శాసించే స్థాయి పదవి దక్కించుకున్నారు. ఇండియా మూలలున్న ఎంతో మంది ప్రస్తుత ప్రభుత్వం లో కీలక పదవులలో కొనసాగడం విశేషం. కీలకమైన ఓటింగ్‌లలో ఉపాధ్యక్షురాలి హోదాలో కమలా హ్యారిస్‌ ఇలా తన ఓటును వినియోగిం చుకోవడం ఏడాదికాలంలో ఇది ఆరోసారి కావడం విశేషం. ‘ప్రజాసేవలో, దాతృత్వ కార్యక్రమాల్లో కిరణ్‌కు రెండు దశాబ్దాల కుపైగా అపార అనుభవముంది. గతంలో నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలోనూ కిరణ్‌ ఓపీఎంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇకమీదట ఆమె ఓపీఎం అధినేతగా అద్భుత పనితీరు కనబరుస్తారు’ అని సెనేటర్‌ డ్యానీ ఫెయిన్‌స్టెయిన్‌ కీర్తించారు.