Begin typing your search above and press return to search.

ఐర్లాండ్ దేశాన్నే కదిలించిన భారతీయ మహిళ..

By:  Tupaki Desk   |   19 May 2018 11:39 AM GMT
ఐర్లాండ్ దేశాన్నే కదిలించిన భారతీయ మహిళ..
X
ఐర్లాండ్.. యూరప్ లోని సంపన్న దేశాల్లో ఒకటి.. అక్కడ ఎన్నో చట్టాలను సరళీకరించారు. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతించిన తొలి దేశంగా ఐర్లండ్ గుర్తింపు పొందింది. అదేవిధంగా మైనారిటీ వర్గానికి చెందిన గేను ప్రధానిగా చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే మహిళల విషయంలో మాత్రం ఐరిష్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఐర్లాండ్ లోని క్యాథలిక్ మహిళలకు వైద్య నిబంధనలను సాకుగా చూపి అత్యవసర సమయాల్లో వారి ప్రాణాలు పోవడానికి అక్కడి ప్రభుత్వం పరోక్షంగా కారణమవుతోంది.

యెస్ క్యాంపెయిన్ పేరిట ఇప్పుడు ఐర్లాండ్ లో పెద్ద సంగ్రామమే నడుస్తోంది. ఆరేళ్ల క్రితం భారతీయ మహిళా వైద్యురాలు సవితా హలప్పనావర్ అబార్షన్ చేయించుకోవడానికి అక్కడి చట్టాలు ఒప్పుకోకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మనిషి ప్రాణాలు పోతున్నా అబార్షన్ చేయకుండా ఉన్న ఐర్లండ్ నిబంధనలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

గర్భస్రావాల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఐరిష్ మహిళల పోరాటం ఫలించింది. యెస్ క్యాంపెయిన్ పేరిట అబార్షన్ల వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ఊపిరిలూదింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 25న నిర్వహిస్తున్న రెఫరెండంలో ఓటు వేసేందుకు బ్రిటన్, ఇతర దేశాల్లో స్థిరపడిన మహిళలు కూడా రాబోతున్నారు.

ఈ వివాదానికి కారణం భారతీయ మహిళ సవితా హలప్పానావర్.. ఈమె ఇండియా నుంచి ఐర్లాండ్ వెళ్లి సెటిల్ అయ్యింది. ఐర్లాండ్ లో దంత వైద్యురాలిగా పనిచేసేవారు.. 17వారాల గర్భవతి అయిన సవిత.. నడుము నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరారు. గర్భస్రావం కావడంతో వెంటనే అబార్షన్ చేసి పిండాన్ని తొలగించాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కానీ ఐర్లాండ్ చట్టాల ప్రకారం అబార్షన్ చేయడం నేరం.. దీంతో వారం రోజుల పాటు తీవ్రరక్తస్రావం.. ఇన్ఫెక్షన్ కారణంగా సవిత మరణించింది. ఈమె కాదు చాలా మంది ఐర్లాండ్ మహిళల ప్రాణాలు ఇలానే పోయాయి. దీంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఇప్పుడు రిఫెరెండానికి కారణమైంది. మే 25న నిర్వహించే ఓటింగ్ లో ఐరిష్ మహిళలంతా పాల్గొనాలంటూ అక్కడి మహిళలు పేర్కొంటున్నారు. రెఫరెండంలో నెగ్గితే ఈ చట్టాన్ని ఆ దేశ ప్రభుత్వం తొలగించనుంది. దీంతో ఓటింగ్ కోసం పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది..