Begin typing your search above and press return to search.

మరోసారి జాక్ పాట్ కొట్టిన భారతీయుడు..20 కోట్లు - ఎలాఅంటే?

By:  Tupaki Desk   |   5 May 2020 12:00 PM IST
మరోసారి జాక్ పాట్ కొట్టిన భారతీయుడు..20 కోట్లు - ఎలాఅంటే?
X
అదృష్టం ఒకరబ్బా సొత్తు కాదు. అదృష్టం ఉండాలే కానీ అమెరికా కి ప్రెసిడెంట్ కూడా కావచ్చు. తాజాగా ఉపాధి కోసమని దుబాయ్ కి వెళ్లినలో మరో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. సేల్స్ ‌మన్‌ గా పనిచేసే ఓ వ్యక్తి లాటరీలో కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా పది మిలియన్‌ దిర్హమ్స్‌ ( అంటే మన రూపాయల్లో సుమారు రూ.20కోట్లు)సొంతం చేసుకున్నారు.

అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా మూడో తేదీన Big Ticket Draw పేరిట ఓ లాటరీని కండక్ట్ చేస్తుంటారు. ఈ లక్కీ డ్రా లో ఎప్పటికీ ఎన్నోమంది భారతీయులు విజేతలుగా నిలువుగా మరోసారి భారతీయుడికి జాక్‌ పాట్ తగిలింది. సేల్స్‌ మన్‌ గా పనిచేసే ఓ వ్యక్తి లాటరీలో కోటీశ్వరుడు అయిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

పూర్తీ వివరాలు చూస్తే ... కేరళలోని త్రిశ్శూర్‌కి చెందిన దిలీప్‌ కుమార్ ఎల్లికొట్టల్‌ పరమేశ్వరన్ అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా యూఏఈలోని అజ్మాన్ నగరంలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఓ ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ‌మన్ ‌గా పనిచేస్తున్నారు. అబుదాబి అంతర్జాతీయ విమనాశ్రాయంలో ప్రతి నెల మూడో తారీఖున నిర్వహించే లాటరీలో 500 దిర్హమ్స్ పెట్టి ఇటీవల ఆయన ఒక టికెట్ కొన్నారు. ఆ లాటరీ డ్రాలో దిలీప్ సుమారు రూ.20కోట్లు గెలుచుకున్నట్లు అక్కడి స్థానిక వార్త సంస్థ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న దిలీప్ సంతోషం వ్యక్తం చేశాడు. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ము బ్యాంకు లోన్ కు చెల్లించి..మిగిలిన డబ్బును ఇద్దరు పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తానని వెల్లడించాడు.