Begin typing your search above and press return to search.

నయా రికార్డ్ : 550 కోట్ల గంటలు అందులోనే ..ఎందులో అంటే !

By:  Tupaki Desk   |   5 Feb 2020 2:42 PM IST
నయా రికార్డ్ : 550 కోట్ల గంటలు అందులోనే ..ఎందులో అంటే  !
X
'టిక్‌టాక్' ..‘టిక్‌టాక్'..‘టిక్‌టాక్'..ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఈ టిక్ టాక్ మోజులో పూర్తిగా మునిగిపోయింది. తెల్లవారినప్పటినుండి ..రాత్రి బెడ్ పై పడుకునేవరకు టిక్ టాక్ ని వదిలిపెట్టడంలేదు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టిక్‌టాక్‌లోనే ములిగిపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ.. దానితోనే కాలం గడిపేస్తున్నారు. ఈ టిక్ టాక్ వల్ల కొంతమంది మంది సెలబ్రిటీలు అవుతుంటే.. మరికొందరు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఒకానొక సమయంలో.. ఈ టిక్ టాక్ ని బ్లాక్‌ కూడా చేశారు.కానీ , మళ్లీ తీసుకురావాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఇకపోతే , ప్రస్తుతం ఈ టిక్ టాక్ సోషల్ మీడియాలో రారాజుగా అగ్రస్థానంలో వెలుగొందుతుంది. ఈమధ్యే పేస్ బుక్ కన్నా నెటిజన్లు ఎక్కవ ఇన్ స్టాల్ చేసుకోవడంతో పేస్ బుక్ ను వెనక్కు నెట్టేసింది. ఈ టిక్ టాక్ దెబ్బకు పేస్ బుక్ కూడా అలాంటి ఒక యాప్ ను తీసుకురావడానికి ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. కాగా, 2019 ఏడాదిలో టిక్ టాక్ కోసం భారతీయులు దాదాపుగా 550 కోట్ల గంటల సమయాన్ని వెచ్చించారట. అమెరికా కు చెందిన “యాప్ అన్ని డేటా” అనే సంస్థ తెలియచేసిన వివరాల ప్రకారం యూజర్లు 2018 కంటే 2019లో ఎక్కువ మంది సమయం గడిపినట్లు తెలుస్తుంది. 2019 నాటికీ యాప్ ను యాక్టీవ్ గా ఉపయోగించేవారు సంఖ్య 90 శాతం పెరిగినట్లు తెలిపారు. టిక్ టాక్ ఎక్కువగా ఉపయోగించే వారిలో చైనా మొదటి స్థానం లో ఉండగా భారత్ రెండవ స్థానాల్లో ఉంది. దీన్ని బట్టే చెప్పవచ్చు మనవారు ఈ టిక్ టాక్ కి ఎంతగా అడిక్ట్ అయ్యారో ..