Begin typing your search above and press return to search.
యాపిల్‌లో లోపాన్ని కనిపెట్టిన ఇండియన్ టెక్కీ
By: Tupaki Desk | 3 Jun 2020 1:27 PM ISTటెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తమ ఉత్పత్తుల్లో డేటా సురక్షితమని, గోప్యత ప్రధాన లక్ష్యమని ప్రచారం చేస్తుంటుంది. ముఖ్యంగా వినియోగదారుల సమాచార గోప్యతకు కాపాడేందుకు నిరంతరం యత్నిస్తుంటామని చెప్తుంటుంది. అయితే, ఆపిల్ నూతన ఫీచర్ అయిన సైన్ ఇన్ విత్ ఆపిల్ ఫీచర్‌లో ఉన్న లోపాన్ని న్యూఢిల్లీకి చెందిన టెకీ భావుక్ జైన్ గుర్తించారు. దీనిని సరిదిద్దుకుంటామని భావుక్ హామీనిచ్చింది. అలాగే , దీనికి గాను అతను యాపిల్ సంస్థ నుంచి లక్ష డాలర్ల (సుమారు రూ. 75 లక్షలు) ప్రైజ్ మనీని అందుకోనున్నాడు.
యాపిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్ ను సంస్థ అందుబాటులోకి తేగా, ఐడీ లేకుండానే లాగిన్ అయ్యే లోపం అందులో ఉందని కనిపెట్టిన భావుక్ జైన్ అనే యువకుడు, దాన్ని యాపిల్ కు తెలిపాడు. దీనితో వెంటనే ఆ లోపాన్ని యాపిల్ సరిచేసుకుంది. అలాగే, ఆ లోపాన్ని కనిపెట్టి చెప్పినందుకు అతనికి లక్ష డాలర్ల బహుమతిని అందిస్తామని తెలిపింది. కాగా, భావుక్ జైన్ ఇలా సాఫ్ట్ వేర్లలో లోపాలను పసిగట్టడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో యాహూ, ఫేస్ బుక్, గ్రాబ్, గూగుల్ తదితరాల్లోనూ బగ్స్ కనిపెట్టి భారీ ప్రైజ్ మనీలను పొందాడు.