Begin typing your search above and press return to search.

ట్రంప్ ‘ఈఏడీ’..భారత్ కు వస్తున్న ఐటీ నిఫుణులు..

By:  Tupaki Desk   |   22 May 2018 4:35 AM GMT
ట్రంప్ ‘ఈఏడీ’..భారత్ కు వస్తున్న ఐటీ నిఫుణులు..
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణులకు శరాఘాతంగా మారాయి. అదేసమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమవుతోంది. అమెరికాలోని ప్రఖ్యాత ఆపిల్ - ఫేస్ బుక్ - మైక్రోసాఫ్ట్ - గూగుల్ లో పనిచేస్తున్న భారత ఐటీ నిపుణులు ఇప్పుడు అమెరికా వదిలి యూరప్ - భారత్ కు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికన్ కంపెనీలన్నీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అమెరికా అధ్యక్షుడు ముందుకుపోతుండడంతో చాలా కంపెనీలు అమెరికా నుంచి వేరే దేశాలకు తమ సంస్థల్ని తరలించేందుకు రెడీ అవుతున్నాయి. అమెరికాకు ఇది పెద్ద దెబ్బే.. అమెరికా ఆర్థిక పతనానికి కారణమవుతున్న ట్రంప్ నిర్ణయం ఈఏడీ.. అంటే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్..

*ఈఏడీ అంటే.. దీని వల్ల ఏం జరుగుతుంది.?

ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్.. అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవల విభాగం (యూఎస్సీఐఎస్) జారీ చేసే ఈఏడీతో అమెరికాలో తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. హెచ్1బీ వీసా కలిగి, గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసి దాని ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల భార్యలు /భర్తలు ఈఏడీ కింద అమెరికాలో తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈఏడీ విధానాన్ని ట్రంప్ రద్దు చేస్తామని ప్రకటించడంతో ఇలాంటి భారతీయులందరిలో ఇప్పుడు తమ ఉద్యోగాలు పోతాయనే కలవరం మొదలైంది..

*ఈఏడీతో అమెరికా నుంచి వలసలు..

ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐటీ జాబ్ లు చేస్తున్న విదేశీయులందరూ 34శాతం పన్నులు చెల్లించాలి. అంటే జీతంలో దాదాపు మూడింట ఒకవంతు అమెరికా ప్రభుత్వానికే పోతుంది. అందుకే అమెరికాలో భారత ఐటీ నిపుణులు.. వారితో పాటు వెళ్లిన వారి భార్యలు - భర్తలు కూడా సాఫ్ట్ వేర్ జాబులు చేస్తున్నారు. ఇప్పుడు ఈఏడీతో ఐటీ నిపుణుల భార్యలు - భర్తలు పనులు చేయడానికి ఉండదు.. దీంతో ఇప్పుడు భారతీయ ఐటీ నిపుణులు యూరప్, కెనడాలకు వలస వెళ్లాలని నిర్ణయించారు. కొందరు భారత్ కు వచ్చి కొత్త స్టార్టప్ కంపెనీలు పెట్టాలని యోచిస్తున్నారు. ఒక్కరి సంపాదనతో అమెరికాలో బతకడం కష్టం కనుక వారంతా వలస పోవడానికి రెడీ అయ్యారు. ఈఏడీ వల్ల భారత , చైనా నిపుణులు వారి వారి దేశాలకు , విదేశాలకు వలస పోతే అమెరికాలోని ప్రఖ్యాత కంపెనీలకు నిపుణుల కొరత అనివార్యమవుతోంది. ఖాళీ అవుతాయి. దీంతో ఈఏడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కంపెనీలు ట్రంప్ ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే తమ కంపెనీలను కూడా కెనడా, యూరప్ కు తరలిస్తామని ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాప్ట్, యాపిల్ లు యోచిస్తున్నాయట..

*ట్రంప్ ఈఏడీతో ఎవరికి మేలు..

ఈఏడీ నిర్ణయం ఇతర దేశాల నుంచి వలస వచ్చిన ఐటీ నిపుణులకు శరాఘాతంగా మారింది. వారికి వీసాలు కొన్నేళ్లకే పరిమితం చేస్తారు. ఇక వారి భార్యలకు ఉద్యోగాలు చేసుకోవడానికి ఉండదు.. దీనివల్ల విదేశీయులు అమెరికా ఖాళీ చేసి వెళితే అమెరికాలోని స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతాయని వారు భావిస్తున్నారు. కానీ ఇక్కడే చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే ఈఏడీ రద్దు ప్రతిపాదనతో అమెరికాలోని కంపెనీలన్నీ డిగ్రీ చదివిన క్వాలిఫికేషన్ లేని అమెరికన్లకు శిక్షణ ఇస్తూ సాఫ్ట్ వేర్ కొలువులు ఇస్తున్నాయట.. కానీ వారందరూ 6 నెలలు తిరిగే సరికి ఒత్తిడి భరించలేక ఉద్యోగాలు మానేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున కంపెనీల్లో ఖాళీలు ఏర్పడుతున్నాయి. అమెరికన్ల కోసం ప్రవేశపెట్టిన ఈఏడీ నిర్ణయం అంతిమంగా వారికి ఉద్యోగాలు కల్పించకపోగా.. విదేశీ నిఫుణులను దూరం చేస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలుకు దారితీస్తోంది..