Begin typing your search above and press return to search.

81 సెకన్లు ముద్దాడిన కోహ్లీ

By:  Tupaki Desk   |   26 Dec 2016 4:46 AM GMT
81 సెకన్లు ముద్దాడిన కోహ్లీ
X
ముద్దుకు 81 సెకన్లా? అది కూడా ఒక వార్తేనా? అనుకోవచ్చు. కానీ.. కోహ్లీ ముద్దాడింది తన ప్రియురాలు అనుష్కశర్మను కాదు..ట్రోఫీని. ఇంగ్లండ్ టెస్ట్ సీరిస్ తర్వాత ఒక సవాల్ ను స్వీకరించిన కోహ్లీ.. 81 సెకన్లు కదలకుండా.. మెదలకుండా తాను గెలుచుకున్న ట్రోఫీని ముద్దుపెట్టుకుంటున్న ఫోజ్ లో 81 సెకన్ల పాటు ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయాడు. ఎందుకిలా? అన్న డౌట్ వచ్చిందా? దాన్నే తీర్చనున్నాం.

ఇప్పటివరకూ మీరు ఐస్ బకెట్ ఛాలెంజ్.. రైస్ బకెట్ ఛాలెంచ్ లాంటివి వినే ఉంటారు. ఆ తర్వాత ఆ తరహాలో రకరకాల ఛాలెంజ్ లు రావటం.. కొంతకాలంపై హడావుడి సృష్టించటం చేశాయి. తాజాగా అలాంటిదే మానెక్విన్ ఛాలెంజ్ వచ్చింది. దీన్ని స్వీకరించిన టీమిండియా సభ్యులు.. తమ డ్రెస్సింగ్ రూంలో 81 సెకన్ల పాటు.. మిగిలిన పనులన్నీ ఆపేసి.. ఆ కాలంలో ఎవరికి వారు చేస్తున్న పనిని 81 సెకన్ల పాటు బొమ్మలా ఉండిపోయారు.

ఈ ఛాలెంజ్ స్వీకరించిన వారు.. 81 సెకన్ల పాటు ఎక్కడి వారు అక్కడే బొమ్మల్లా నిలిచిపోవటంతో ఛాలెంజ్ పూర్తి అవుతుంది. ఇందులో భాగంగా కోహ్లీ ట్రోఫీ ముద్దాడుతున్నట్లు ఉండిపోతే.. ట్రిఫుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్ ను అభినందిస్తున్నట్లుగా మనీష్ పాండే ఉండిపోతే.. పుజారా బ్యాట్ ను అబ్జర్వ్ చేస్తున్నట్లు.. ఇషాంత్ సేద తీరుతున్నట్లు ఉండిపోయారు. ఇలా టీమిండియా సభ్యులు.. సహాయక బృందం 81 సెకన్ల పాటు అన్ని వదిలేసి ఎవరికి వారు వారికి నచ్చిన భంగిమలో అలా ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక వెబ్ సైట్లో ఉంచింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/