Begin typing your search above and press return to search.
రికార్డు సృష్టించిన సోనియా రామన్ : ఆమె ఎవరంటే..?
By: Tupaki Desk | 10 Jun 2022 12:02 PM ISTపాశ్చాత్య దేశాల్లోని వివిధ రంగాల్లో భారత సంతతికి చెందిన వారు అనేక విజయాలు సాధిస్తున్నారు. సాధ్యం కానీ పనులను సుసాధ్యం చేస్తూ దేశ కీర్తిని నిలబెడుతున్నారు. ముఖ్యంగా ఇండియాకు యువతులు, మహిళలు పలు విభాగాల్లో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా భారత గడ్డకు చెందిన ఓ అమ్మాయి బాస్కెట్ బాల్ కోచ్ గా నియమితులయ్యారు. అమెరికాలోని NBA(Nation Basketball Association)కు కోచ్ గా నియమాకం కావడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి అసోసియేషన్ కు సోనియా రామన్ కోచ్ గా నియమితులై.. మొదటి ఇండియన్ వుమెన్ గా రికార్డుల్లోకెక్కారు.
ఇప్పటికే వ్యాపారాల్లో, రాజకీయాల్లో భారత్ కు చెందిన వారు పాగా వేశారు. పలు హోదాల్లో పనిచేస్తూ భారత్ పేరును నిలబెడుతున్నారు. అమెరికాలోని చాలా కంపెనీలు, సంస్థల్లో భారత్ కు చెందిన వారు పనిచేస్తు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మైక్రోసాఫ్ట్ ట్విట్టర్, గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీల్లో పనిచేస్తున్నారు. అయితే కేవలం వ్యాపార, రాజకీయ ఉద్యోగాల్లోనే కాకుండా అక్కడి క్రీడా విభాగంలోనూ మనవాళ్లు చోటు సంపాదించారు.
అందులోనూ అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన బాస్కెట్ బాల్ విభాగంలో భారత్ కు చెందిన అమ్మాయి కోచ్ గా నియమితులయ్యారు. చిన్నప్పటి నుంచే బాస్కెట్ బాల్ కు మక్కు వ పెంచుకున్న సోనియా రామన్ అనే అమ్మాయి ఇప్పుడు అమెరికాలోనే NBAకో కోచ్ గా నియమితులయ్యారు. అయితే సోనియార రామన్ ఎవరు..? ఆమె తల్లదండ్రులు భారత్ లో ఏ ప్రాంతానికి చెందినవారు..?
సోనియా రామన్ అమెరికాలో పుట్టి పెరిగినా.. ఆమె తల్లిదండ్రులు మాత్రం భారత్ కు చెందినవారే. ఆమె తల్లి నాగ్ పూర్ కు చెందినవారు కాగా.. తండ్రి చెన్నై వాస్తవ్యుడు. వీరు యూఎస్ లో స్థిరపడిన తరువాత సోనియా జన్మించింది. ప్రస్తుతం వీరు బోస్టన్లో నివాసముంటున్నారు.
ఆమె మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) లో మహిళల బాస్కెట్ బాల్ కోచ్ గా నియమితులయ్యారు. ఇందులో ఉండగా 2018లో వరుసగా రెండు సార్లు కాన్ఫరెన్స్ టైటిల్ తీసుకొచ్చేలా కృషి చేశారు. దీంతో ఆమె MIT చరిత్రలోనే ‘ఆల్ టైమ్ విన్నింగ్ కోచ్’గా పేరు తెచ్చుకున్నారు.
ఇలా 12 సంవత్సరాల పాటు MIT కు కోచ్ గా కొనసాగారు. ఆ తరువత న్యూ ఇంగ్లండ్ ఉమెన్స్ అండ్ మెన్స్ అథ్లెటిక్ కాన్ఫరెన్స్ కోచ్ ఆఫ్ ది ఇయర్ గా రెండు సార్లు ఎంపికయ్యారు. ఇక 2019-20 సీజణ ప్రారంభం నుంచి NBAలో అసిస్టెంట్ కోచ్ గా చేరారు. అలాగే మెంఫిన్ గ్రిజ్లీస్ కు సహాయకురాలిగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ NBAకు ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు.