Begin typing your search above and press return to search.

కరోనా: భారత శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం

By:  Tupaki Desk   |   18 April 2020 12:30 PM GMT
కరోనా: భారత శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం
X
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మందికి సోకి లక్షన్నర మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ కు ఇప్పటికీ మందు కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోని దేశాలన్నీ నిమగ్నమయ్యాయి.

ఇప్పటికే అమెరికా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ విషయంలో తీవ్ర ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరు మందు కనిపెడితే వారికి క్రెడిట్ వస్తుంది కాబట్టి అంతా దీనిపైనే నిమగ్నమయ్యారు.

ఇక భారత ప్రధాని నరేంద్రమోడీ పిలుపుమేరకు భారత శాస్త్రవేత్తల బృందం కూడా తాజాగా కరోనాపై పడింది. అయితే వినూత్నంగా మన శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. గతంలో కుష్ణు వంటి అంటువ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు ఇప్పుడు కుష్ఠు వ్యాధి నుంచే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.70వ దశకంలో కుష్టును జయించిన భారత శాస్త్రవేత్తల స్ఫూర్తితో అదే వ్యాక్సిన్ ను పరిశోధిస్తూ కరోనాపై పున: పరిశోధనలు చేస్తున్నట్టు సమాచారం.

కేంద్రం అనుమతులు తీసుకొని కుష్టు వ్యాక్సిన్ పై పరిశోధన చేసి కేవలం నెలన్నరలోనే కరోనా వ్యాక్సిన్ కనిపెడుతామని భారత శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు, కుష్టు వ్యాధికి దగ్గరి పోలికలు ఉండడంతో ఈ గుట్టును ఛేధిస్తామంటున్నారు. మరి వారి పరిశోధన ఫలిస్తే ప్రపంచంలోనే కరోనాకు మందు కనిపెట్టిన దేశం భారత కీర్తి పతాక రెపరెపలాడడం ఖాయం.. చూడాలి మరీ..