Begin typing your search above and press return to search.

ముందస్తుకు మోడీ ... ?

By:  Tupaki Desk   |   10 Jan 2022 7:00 AM IST
ముందస్తుకు మోడీ ... ?
X
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామాలు మార్చి తరువాత చోటు చేసుకుంటాయని అంటున్నారు. అయిదు కీలకమైన రాష్ట్రాల ఎన్నికల నగరా లేటెస్ట్ గా మోగింది. దాదాపుగా వంద పార్లమెంట్ సీట్లను ప్రభావితం చేసే విధంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి గెలవడం చాలా ముఖ్యం. మిగిలినవి పక్కన పెట్టినా యూపీని కనుక గెలిస్తే బీజేపీ జోలికొచ్చే వారు ఎవరూ 2024 దాకా ఉండరు.

కానీ యూపీలో బొమ్మ తిరగబడితే మాత్రం కమలానికి చుక్కలు చూపించేందుకు విపక్షాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి. దాంతో యూపీ గురించే బీజేపీ అన్ని రకాలైన ఆలోచనలు చేస్తోంది. యూపీనే దృష్టిలో పెట్టుకుని తన రాజకీయ అజెండాను ఖరారు చేస్తోంది. మరి అన్ని విధాలుగా ఎత్తులు వేసినా కూడా యూపీ చేజారింది అంటే కనుక బీజేపీకి బీపీ పెరగడం ఖాయం.

అందుకే బీజేపీ ప్లాన్ బీని రెడీ చేసి పెట్టుకుంది అంటున్నారు. ఏ మాత్రం యూపీలో తేడా వస్తే కనుక ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిధ్ధపడుతుంది అన్నది జాతీయ స్థాయిలో వినిపిస్తున్న మాట. దానికి కారణాలు చాలా ఉన్నాయి. బీజేపీ మూడవసారి అధికారంలోకి రావాలని చూస్తోంది.

దానికి అడ్డుగా విపక్షాలు మూడవ కూటమిని కట్టి బలంగా మారితే బీజేపీ కల ఎట్టి పరిస్థితుల్లో సాకారం కాదు. అందుకే విపక్షాలు బలపడకుండా ముందస్తు ఎన్నికల శంఖారావం పూర్తినడం ద్వారా వీలైనంతగా పొలిటికల్ అడ్వాంటేజ్ ని పొందేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది అంటున్నారు.

మొత్తానికి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను మారుస్తాయని అటు విపక్షాలు కూడా అంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. బీజేపీ కనుక ముందస్తు అంటే తెలుగు రాష్ట్రాలలో కూడా పరిణామాలు చకచకా మారుతాయ‌ని అంటున్నారు.