Begin typing your search above and press return to search.

తాలిబన్ల చేతుల్లో భారత్ విమానం..ఆనాడు వాజ్‌పేయి ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:31 AM GMT
తాలిబన్ల చేతుల్లో భారత్ విమానం..ఆనాడు వాజ్‌పేయి ఏంచేశారంటే ?
X
ఆఫ్ఘనిస్థాన్‌ లో చీకటి చరిత్ర మళ్లీ పునరావృతమవుతున్నది. ప్రపంచ ప్రసిద్ధ బమియాన్‌ బుద్ధ విగ్రహాలను కూల్చివేసిన తాలిబన్లు మళ్లీ ఆ దేశాన్ని ఏలబోతున్నారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు రాజధాని కాబూల్‌ లోని విమానాశ్రయానికి వేలాదిమంది ఆఫ్ఘన్లు పరుగులు తీశారు. రన్‌ వే పై విమానం కదులుతున్నా కొంచెం చోటు దక్కకపోతుందా అని వెంబడించిన వందలాదిమంది జనం, రెక్కలను పట్టుకొని కూర్చొని ఆకాశంలోకి విమానం ఎగిరిన తర్వాత పట్టు కోల్పోయి నేల మీద పడి ప్రాణాలు కోల్పోయిన మరికొందరు హృదయవిదారకమైన ఈ వీడియోలు ఆఫ్ఘన్ల దైన్యాన్ని, తాలిబన్ల పాలనలో వాళ్లకు ఎదురుకానున్న పరిస్థితులకి అద్దం పడుతున్నాయి. స్వదేశంలో స్వజాతీయులను ఇంతగా భయకంపితులను చేస్తున్న తాలిబన్లకు ఒకప్పుడు విముక్తివీరులుగా పేరు ఉండటం విశేషం.

ఇక ఇదిలా ఉంటే .. ఇదే తాలిబన్ల తో భారత్ సైతం చిక్కులు ఎదుర్కోంది. వారి పేరు చెప్పగానే గుర్తొచ్చేది నాటి విమాన్ హైజాక్. భారత్ బంధీలుగా పట్టుకున్న తమ సహచరులను విడుదల చేయటంతో పాటుగా, నగదు డిమాండ్ చేస్తూ విమానం హైజాక్ చేసారు. వారం రోజుల పాటు విమానం లోని ప్రయాణీకులు వారి చెరలో బందీలుగా ఉన్నారు. 1999 డిసెంబర్ 24 న జరిగిన విమానం హైజాక్ ఎపిసోడ్ డిసెంబర్ 31న ముగిసింది. ఆ రోజు ఏంజరిగింది అంటే .. సాయంత్రం 5గంటలకు భారత గగనతంలోకి విమానం ప్రవేశించగానే అప్పటికే అందులో ఉన్న హైజాకర్లు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్ సర్, లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌ లోని కాందహార్‌ కు తరలించారు.

భారత్ ఆధీనంలో ఉన్న తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. 200 మిలియన్ డాలర్లు , ఇవ్వాలని షరతు విధించారు. హైజాక్ కు గురైన సీ814 విమానంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. భారత గగనతలంలోకి రాగానే కాక్‌ పిట్ వైపు వచ్చిన ముసుగు ధరించిన మిలిటెంట్లు విమానాన్ని లాహోర్‌ కు తీసుకువెళ్లాలని ఆదేశించారు. లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్‌ ను బెదిరించారు. అదే సమయంలో సీట్లలో నుంచి లేచి, విమానంలోని నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్న మిలిటెంట్లు ప్రవేశించారు. విమానాన్నిలాహోర్ వైపు మళ్లించాలని కెప్టెన్ దేవీ శరన్ కు మిలిటెంట్లు ఆదేశించారు. అయితే విమానంలో తక్కువ ఇంధనం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని అమృత్‌ సర్‌ లో దించారు కెప్టెన్. అయితే అదే సరైన సమయంగా భావించిన భద్రతా దళాలు ఆపరేషన్ కు సిద్దమయ్యారు.

అయితే ,వెంటనే పసిగట్టిన హైజాకర్లు ఇంధనం నింపకుండానే విమానాన్ని లాహోర్ తీసుకువెళ్లేలా పైలట్‌ పై ఒత్తిడి తెచ్చారు. దాంతో చేసేదేమి లేక లాహూర్ కు తీసుకువెళ్లారు. లాహూర్ విమానాశ్రయ అధికారులతో మంతనాలు చేసారు. అయితే వారు ఇంధనం నింపుకొని వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు దాంతో లాహోర్ విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్ చేయించారు హైజాకర్లు. అక్కడినుంచి దుబాయి విమానాశ్రయానికి విమానం పయనమైంది. 27 మంది ప్రయాణికులను అక్కడ విడుదల చేసారు హైజాకర్లు. అదేసమయంలో దుబాయి విమానాశ్రయంలో హైజాకర్లపై చర్యలు తీసుకోవాలని యూఏఈని భారత్ కోరింది అందుకు యూఏఈ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత అక్కడినుంచి ఆఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు చేరుకుంది. చలిలో వారం పాటు విమానాశ్రయంలోనే ప్రయాణీకులు ఉన్నారు

అక్కడే హైజాకర్లు పైన యాక్షన్ తీసుకునేందుకు భారత్ కమాండో సిద్ధమైంది. అందుకు అఫ్గానిస్తాన్ ను భారత్ అనుమతి కోరింది. కానీ విదేశీ సైన్యం తమ భూభాగంలోకి వద్దని అఫ్గాన్ వెల్లడించింది. ఆ తర్వాత తాలిబన్లతో భారత్ చర్చలు జరిపింది. తమ బందీలుగా వారిని విడుదల చేయాలన్న కోరారు తాలిబన్లు. హైజాకర్ల డిమాండ్లకు అంగీకరించిన భారత్ మిలిటెంట్ల విడుదలకు అంగీకారం తెలిపింది. రెండుసార్లు కాందహార్ వచ్చిన అప్పటి భారత విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ హైజాకర్లతో సంప్రదింపుల జరిపారు. మిలిటెంట్లు మౌలానా మసూద్ అజహర్, ముశ్తాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ శేఖ్‌ లను విడుదల చేసి భారత్‌ లోని జైళ్ల నుంచి కాందహార్ విమానాశ్రయానికి తీసుకు వచ్చి అప్పగించారు. ఈ ఘటన తర్వాత మరో విమానంలో ప్రయాణీకులు క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధానిగా వాజ్ పేయ్ ఉన్నారు. ప్రయాణీకుల ప్రాణాలే ప్రధానమంటూ రాజకీయంగా ఒత్తిళ్లు వచ్చాయి. కొందరు ప్రయాణీకులను కోల్పోవాల్సి వచ్చింది. అది భారత్ ప్రభుత్వం పైన నాడు తీవ్రంగా ప్రభావం చూపింది. ఇప్పుడు మళ్ళీ అఫ్గాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు.