Begin typing your search above and press return to search.

ఇండో-పాక్ స్వలింగుల పెళ్లి.. వైరల్

By:  Tupaki Desk   |   2 Sept 2019 10:19 AM IST
ఇండో-పాక్ స్వలింగుల పెళ్లి.. వైరల్
X
ఇండియా పాకిస్తాన్ అంటే శత్రుదేశాలు.. వీటి మధ్య యుద్ధ వాతావరణమే.. ఇండియన్లు, పాకిస్తాన్ ప్రజలు క్రికెట్ మ్యాచ్ లో ఎదురుపడ్డా ఇదే ఘర్షణ పూరిత యుద్ధవాతావరణం కనిపిస్తుంది. కానీ ఇద్దరు ఇండోపాక్ స్వలింగులు తమ ప్రేమకు దేశాల మధ్య శతృత్వం అడ్డుకాదని నిరూపించారు.

తాజాగా ఇండియా-పాకిస్తాన్ కు చెందిన ఓ స్వలింగ సంపర్క జంట ఒక్కటైంది. ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరూ ముద్దులతో ముచ్చట్లు ఆడుకుంటున్న ఫొటోలు వైరల్ గా మారాయి.

ఇండియా కు చెందిన క్రైస్తవ మతానికి చెందిన బియాంక మైలీ - పాకిస్తానీ ముస్లిం కుటుంబానికి చెందిన సైమాలు అమెరికాలోని న్యూయార్క్ లో నివసిస్తున్నారు. ఒకసారి వీరిద్దరికి పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన వివాహ వేడుకలో బియాంక చీర - నగలతో ముస్తాబు అయ్యి హోయలు ఒలకగా.. సైమా నల్లరంగు షేర్వానీ ధరించి మగరాయుడిలా ఫోజులు ఇచ్చింది. ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇలా ఇద్దరు స్వలింగ సంపర్కులు.. అది ఇండియా-పాకిస్తాన్ లకు చెందిన వారు పెళ్లి చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం వైరల్ అయ్యింది.