Begin typing your search above and press return to search.

కసాయి సవితి తల్లి.. కఠిన శిక్ష

By:  Tupaki Desk   |   4 Jun 2019 1:41 PM IST
కసాయి సవితి తల్లి.. కఠిన శిక్ష
X
నిండా తొమ్మిదేళ్లు కూడా లేని పసిమనసు.. కల్లా కపటం లేదు.. తల్లి చనిపోవడంతో తండ్రి గారాలపట్టిగా ఉంది. అయితే తండ్రి వేరే పెళ్లి చేసుకోవడంతో సవతితల్లి చేరువైంది. మరో అమ్మ దొరికిందని సంబరపడింది. కానీ ఆ సవతితల్లే కాలయముడు అవుతుందని ఆ చిట్టితల్లి ఊహించలేకపోయింది.. సవతితల్లి అఘాయిత్యానికి ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

భారత సంతతికి చెందిన షామ్ దాయి అర్జున్ (55) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. ఆ మహిళ భర్త, అతడి తొమ్మిదేళ్ల కూతురితో కలిసి న్యూయార్క్ లోని క్వీన్స్ లో నివసిస్తోంది. అయితే సవతి కూతురిపై అక్కసు పెంచుకున్న షామ్ దాయి ఆమెను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది..

2016 ఆగస్టులో ప్లాన్ ప్రకారం బాత్ రూమ్ లో గొంతు నులిమి చంపేసింది. స్నానం చేయిస్తానని తీసుకెళ్లి హతమార్చింది. ఆమె పక్కనే ఉండే ఓ మహిళ తన మనవలతో కలిసి షామ్ దాయి ఇంటికి వచ్చింది. చిన్నారిని కలవాలని ఉందని కోరింది. దానికి షామ్ దాయి పొంతన లేని సమాధానం వచ్చింది. దీంతో ఆమెభర్త రాగా బాత్రూంలో స్నానం చేస్తోందని వివరించింది. గంట సేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు తీయగా బాత్ టబ్ లో విగత జీవిగా పడి ఉంది. గొంతు నులిమినట్టు మరకలున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి. పోలీసుల విచారణలో తానే చిన్నారి గొంతు నులిమి చంపినట్టు ఆ కసాయి తల్లి ఒప్పుకుంది.

దీంతో కోర్టు తాజాగా షామ్ దాయిని దోషిగా తేల్చింది. ఏకంగా 22 ఏళ్ల జైలుశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ శిక్షసరిపోదని.. చిన్నారి చేతులు కట్టేసి, గొంతు నులిమి దారుణంగా చంపిన దెయ్యాల్లాంటి సవతి తల్లుల కథల్లో ఇది దారుణమైన సంఘటన అని అటార్నీ జాన్ రియాన్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈమెను జీవితాంతం జైళ్లో పెట్టినా తప్పులేదని తెలిపారు.