Begin typing your search above and press return to search.

భారత సైంటిస్ట్ గల్లంతు మిస్టరీ

By:  Tupaki Desk   |   18 Jun 2019 3:41 PM IST
భారత సైంటిస్ట్ గల్లంతు మిస్టరీ
X
ఉత్తర భారత దేశానికి చెందిన ప్రముఖ సైంటిస్ట్ విజయ్ కుమార్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో 25 ఏళ్లుగా సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు విజయ్ కుమార్. ఆయన 20 ఏళ్లుగా శాక్రమెంటోలో నివాసం ఉంటున్నాడు. జూన్ 10 అమెరికాలోని శాక్రమెంటో నింబస్ డ్యామ్ వద్ద గల్లంతయ్యాడు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు, ఇండియన్ అసిసోయేషన్ లు జల్లెడ పడుతున్నాయి. పోలీస్ తో పాటు ప్రవాస భారతీయ సంఘాలు ఆయన కోసం డ్యామ్ లో జల్లెడ పడుతున్నాయి. అయితే ఇప్పటికీ 8 రోజులు గడుస్తున్నా ఆయన జాడ తెలియడం లేదు.

భర్త ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని వేడుకుంటోంది ఆయన భార్య మాధురి కోరుతోంది. బయోమెడికల్ సైన్సెస్ ఎన్నో పరిశోధనలు చేసిన ఈయన ఏంతో పేరు గడించారని చెప్పుకొచ్చారు. గల్లంతైన తర్వాత ఆయన కారు కీస్, వాలెట్, మొబైల్ మాత్రమే దొరికిందని.. ఆయన గురించి జాడలేదని వాపోయింది.

రెండు దశాబ్ధాలుగా శాస్త్రవేత్తగా ఎంతో పేరు గడించిన విజయ్ కుమార్ ఇలా డ్యామ్ వద్ద గల్లంతు కావడం.. ఆయన డెడ్ బాడీ దొరకకపోవడంతో ఆయన ఎక్కడో ఓ చోట ఉంటారని ఆయన ఫొటోలను డ్యామ్ తీరాప్రాంతంలో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పంచుతున్నారు. సోషల్ మీడియా, మీడియాలోనూ ఆయన మిస్సింగ్ పై ప్రకటనలు చేస్తున్నారు.

విజయ్ కుమార్ చాలా హార్డ్ వర్కర్, బాధ్యతగల వ్యక్తి అంటున్నారు. ఆయన ఎక్కడున్నారు.. ఉంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే తెలిస్తే సమాచారం ఇవ్వాలని విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు.