Begin typing your search above and press return to search.

వైద్య శాస్త్రంలో పెద్ద అడుగు..మ‌నోడి కెమెరా!

By:  Tupaki Desk   |   5 Sept 2017 11:39 AM IST
వైద్య శాస్త్రంలో పెద్ద అడుగు..మ‌నోడి కెమెరా!
X
ఇటీవ‌ల కాలంలో భార‌తీయుల స‌త్తా ప్ర‌పంచానికి చాటే ఉదంతాలు త‌ర‌చూ వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా అలాంటిదే మ‌రొక‌టి చోటు చేసుకుంది. మ‌నిషి శ‌రీరంలోని అంత‌ర్గ‌త భాగాల‌ను స్ప‌ష్టంగా చూపించే శ‌క్తివంత‌మైన కెమెరాను అభివృద్ధి చేశారు. దీని కార‌ణంగా ఖ‌రీదైన‌..స్కానింగ్‌.. ఎక్స్ రేల‌పై ఆధార‌ప‌డే అవ‌స‌రం ఉండ‌దు.

దీంతో..సామాన్యుల‌కు సైతం చౌక‌గా వైద్య ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించే వీలు ఉండ‌నుంది. బ్రిట‌న్ లోని ఎడిన్ బ‌రో వ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఈ కెమెరాను క‌నిపెట్టారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వైద్య శాస్త్రంలో చ‌క్క‌టి ఆవిష్క‌ర‌ణగా భావిస్తున్న ఈ కెమెరాను అభివృద్ధి చేసిన బృందానికి నేతృత్వం వ‌హిస్తున్న‌ది ఒక భార‌తీయుడు కావ‌టం విశేషంగా చెప్పాలి.

శ‌రీర అవ‌యువాల మీద కచ్ఛిత‌మైన అంచ‌నాల కోసం ఈ కొత్త కెమెరా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ శ‌రీర అవ‌యువాలపై క‌చ్ఛిత‌మైన అంచ‌నాల కోసం ఎండోస్కోప్‌ ను శ‌రీరంలోకి పంపి.. దాని సాయంతో చికిత్స చేస్తున్నారు. అయితే..ఎండోస్కోప్ ఎక్క‌డ ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌టం కొంత క‌ష్టంగా ఉండేది. తాజా గా అభివృద్ధి చేసిన కెమెరాతో ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించే వీలుంది.

ఈ కొత్త త‌ర‌హా కెమెరాతో అంత‌ర్గ‌త భాగాల్ని స్ప‌ష్టంగా చూసే వీలుంద‌ని చెబుతున్నారు. ఎడిన్ బ‌రో వ‌ర్సిటీకి చెందిన భార‌త సంత‌తి శాస్త్ర‌వేత్త కేవ్ ధాలీవాల్ నేతృత్వంలోని బృందం ఈ కొత్త కెమెరాను త‌యారు చేశారు. భిన్న త‌ర‌హా వైద్య ప‌రీక్ష‌ల‌కు సాయంగా నిల‌వటంతో పాటు.. ఖ‌రీదైన స్కానింగ్‌.. ఎక్స్ రేల ఖ‌ర్చుకు ఈ కెమెరా కోత పెట్ట‌గ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.