Begin typing your search above and press return to search.
అమెరికాలో భారత సంతతి డ్రైవర్ అప్రమత్తం .. తప్పిన పెను ప్రమాదం !
By: Tupaki Desk | 28 May 2021 6:00 AM ISTఅగ్రరాజ్యమైన అమెరికాలో గత కొన్ని రోజులుగా ఆసియన్ అమెరికన్లపై దాడులు జరుగుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా న్యూయార్క్ లో ఓ ఘటన చోటుచేసుకుంది. కొందరు అమెరికన్లు ఓ ఆసియన్ వ్యక్తిని తీవ్రంగా కొట్టి స్థానికంగా ఉండే రైల్వే ట్రాక్‌పై పడేసి అక్కడినుండి వెళ్లిపోయారు. అయితే , ఈ ఘటన జరిగిన కొద్ది సమయానికే అదే ట్రాక్‌పై ఓ రైలు వస్తోంది. కానీ, తీవ్రంగా గాయపడిన వ్యక్తి ట్రాక్‌పై నుంచి లేవలేని పరిస్థితి.
అయితే ,ఆ విషయాన్ని గమనించిన సబ్ వే ఆపరేటర్ వెంటనే ఆ ట్రైన్ డ్రైవర్ ను అప్రమత్తం చేశాడు. ఆ ట్రైన్ డ్రైవ్ చేస్తుంది తొబిన్ మొదాతిల్ అనే భారత సంతతి వ్యక్తి. సబ్‌వే ఆపరేటర్ సూచన మేరకు వెంటనే అప్రమత్తమైన తొబిన్ చాలా చురుగ్గా వ్యవహరించారు. ట్రాక్ పై ఉన్న వ్యక్తి గాయాలతో ఉండడం గమనించిన తొబిన్ 30 అడుగుల దూరంలోనే ట్రైన్ ను నిలిపివేయడంతో పెద్ద పెను ముప్పు తప్పింది. ఇక రైలు ఆగిపోయిన తర్వాత అక్కడ ఉన్నవారిలో కొందరు ట్రాక్ పై గాయాలతో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం సమీపంలోని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా, చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన తొబిన్ పై అక్కడి మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. భారత సంతతి డ్రైవర్ ను సూపర్ హీరో అంటూ నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.