Begin typing your search above and press return to search.

ట్రంప్ ను కొట్టే మహిళ ఆమేనంట

By:  Tupaki Desk   |   13 Nov 2016 5:45 AM GMT
ట్రంప్ ను కొట్టే మహిళ ఆమేనంట
X
ఊహించని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన అంశాలపై జోరుగావిశ్లేషణలు ఓపక్క సాగుతున్న వేళ.. మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. జనవరిలో అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ పాలన ఎలా ఉంటుందన్న చర్చ ఓపక్క.. ఆయన తర్వాత ఆయన స్థానంలో అధ్యక్ష పదవిని చేపట్టేది ఎవరన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.

అంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే.. ఆయన పదవీ కాలం తర్వాత ఎవరికి ఆ పదవి దక్కే అవకాశం ఉందన్న అంశంపై అమెరికా మీడియా చర్చలు మొదలెట్టింది. ఈ అంశంపై ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన హఫింగ్ స్టన్ పోస్ట్ తాజాగా వెలువరించిన అంచనా ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. పలువురి చర్చలకు ముడిసరుకుగా మారింది.

సదరు మీడియా సంస్థ అంచనా ప్రకారం.. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ స్థానాన్ని డెమొక్రటిక్ పార్టీకి చెందిన మహిళా నేత.. భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్ కు దక్కుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కీలకమైన కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి సెనేట్ కు ఎన్నికైన తొలి ఏషియన్ – నల్లజాతి పౌరురాలైన కమలా.. ట్రంప్ వారసురాలు అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి,

51 ఏళ్ల హ్యారీస్ మూలాల్లోకి వెళితే ఆమె తల్లి స్వస్థలం చెన్నై కాగా.. ఆమె తండ్రిది జమైకా. తాజాగా సెనేట్ కు ఎన్నికైన తర్వాత ఆమెగురించి.. ఆమె సామర్థ్యం గురించి కొన్ని అమెరికన్ మీడియాలలో ప్రత్యేక వ్యాసాలు అచ్చు కావటం గమనార్హం. తొలి నుంచి ట్రంప్ ను విపరీతంగా వ్యతిరేకంచే ఆమె.. ఇమిగ్రేషన్ చట్టాల కఠినతరం.. వలసవాదులపై ఆంక్షలతో పాటు పలు అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమెను డెమొక్రాట్ల తరఫు అధ్యక్ష స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మీడియాలో ప్రత్యేక కథనాలు రావటం విశేషంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/