Begin typing your search above and press return to search.

సముద్రంలో కుప్పకూలిన ఫైటర్​జెట్​ విమానం.. ఫైలెట్​ గల్లంతు..!

By:  Tupaki Desk   |   27 Nov 2020 7:00 PM IST
సముద్రంలో కుప్పకూలిన ఫైటర్​జెట్​ విమానం.. ఫైలెట్​ గల్లంతు..!
X
అరేబియాలో ఓ ఫైటర్​జెట్​ విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ఉన్న ఓ ఫైలట్​ ప్రాణాలతో బయటపడ్డాడు. మరో ఫైలట్​ గల్లంతయ్యాడు. అతడి కోసం రెస్క్యూసిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. గురువారం సాయంత్రం భారత నౌకాదళానికి చెందిన మిగ్​-29 ఫైటర్​జెట్​ ఎయిర్​క్రాఫ్ట్ సముద్రంలో కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో పైలట్​ కోసం రెస్క్యూసిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. మిగ్-29కే అరేబియా సముద్రంలో కుప్పకూలిన విషయాన్ని భారత నౌకాదళాధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు.

మిగ్-29కే ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తోన్న సమయంలో ప్రమాదానికి గురైందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. ఒక పైలెట్‌ను కాపాడారు. మరో పైలెట్ జాడ కనిపించలేదు. అతడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నది. నౌకాదళం అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ మిగ్-29కే. ఇలాంటి ఎయిర్ క్రాఫ్టులు మొత్తం 40 వరకు నౌకాదళంలో ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి దీన్ని ఆపరేట్ చేస్తారు.

అరేబియా సముద్రంలో కొద్దిరోజుల కిందట నిర్వహించిన మలబార్ యుద్ధ విన్యాసాల్లోనూ ఈ మిగ్ పాల్గొంది.గోవాలోని నేవీ బేస్ క్యాంప్ నుంచి మిగ్-29కే రకానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌లను వినియోగిస్తుంటారు. శిక్షణలో భాగంగా గురువారం ఉదయం బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి వెళ్లిన ఈ ఎయిర్ క్రాప్ట్ అరేబియా సముద్రంపై ప్రయాణిస్తోన్న సమయంలో ప్రమాదానికి గురైంది.