Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : సెమీస్ లో ఓడిన భారత్ మెన్ హాకీ టీమ్ !

By:  Tupaki Desk   |   3 Aug 2021 4:01 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : సెమీస్ లో ఓడిన భారత్ మెన్ హాకీ టీమ్ !
X
జపాన్ లోని టోక్యో లో జరుగుతున్న విశ్వ క్రీడలైన ఒలింపిక్స్ లో సెమీఫైనల్ లో ప్రపంచ నెంబర్ 1 హాకీ జట్టు బెల్జియం చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. 5-2 గోల్స్ తేడాతో ఇండియా ఓటమి చెందింది. పతకం ఖాయం చేసుకోవడం కోసం భారత, బెలియం జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లు రెండో క్వార్టర్ ముగిసే సరికి 2-2 గోల్స్ చేసి హోరాహోరీగా తలపడ్డాయి. అయితే నాలుగో క్వార్టర్ లో అడుగు పెట్టిన తర్వాత బెల్జియం జట్టు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి భారత్ ను ఒత్తిడి లోకి నెట్టి గోల్స్ కొట్టింది.

వరసగా రెండు గోల్స్ చేసి.. భారత్ పై 5-2 గోల్స్ తేడాతో గెలిచి టోక్యో ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరుకుంది. ఇక భారత్ కాంస్య పతకం కోసం మన్‌ ప్రీత్‌ సింగ్‌ బృందం మరో మ్యాచ్‌ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ లో గెలిస్తే ఇండియా కి మరో పథకం ఖాయం. 41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్‌ పసిడి పతకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ జట్టు ప్రయాణం అడుగు దూరంలో ఆగిపోయింది. 1972 తర్వాత ఒలింపిక్స్‌ లో తొలిసారి సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించిన భారత్‌…సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ బెల్జియం జట్టుపై విజయం సాధించాలని ప్రతి భారతీయుడు ఎంతో ఆశగా దేవుడిని కోరుకున్నాడు.

అయితే నాలుగో క్వార్టర్ వరసగా బెల్జియం భారత్ పై 3 గోల్స్ చేసి ఫైనల్ కు చేరుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది బెల్జియం.. పై ఓడిన భారత్ జట్టు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. ఎనిమిది ఒలింపిక్ స్వర్ణ పతకాలలో భారతదేశం చివరిగా 1980 మాస్కో క్రీడలలో తిరిగి వచ్చింది, అయితే ఈ ఎడిషన్‌ లో సెమీఫైనల్స్ లేవు, ఎందుకంటే ఈ ఈవెంట్‌లో ఆరు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. మేజర్ ధ్యాన్ చంద్ మరియు బల్బీర్ సింగ్ సీనియర్ వంటి ప్రపంచ ప్రముఖులకు ఇచ్చిన దేశానికి, ఈ ఎడిషన్‌ కు ముందు హాకీ జట్ల ఒలింపిక్ పరాజయాలను చూడటం చాలా బాధాకరమైనది. ఒలింపిక్స్‌ లో సెమీఫైనల్స్‌ లో చివరిసారిగా భారతదేశం 1972 లో జరిగిన మ్యూనిచ్ గేమ్స్‌లో 0-2తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.