Begin typing your search above and press return to search.

ప్రేమ కోసం ర‌న్‌ వేపై ఇండియ‌న్ స‌ర్క‌స్ ఫీట్‌

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:24 PM GMT
ప్రేమ కోసం ర‌న్‌ వేపై ఇండియ‌న్ స‌ర్క‌స్ ఫీట్‌
X
కొన్ని ప్రేమ‌క‌థ‌లు చిత్రంగా మాత్ర‌మే కాదు...షాకింగ్‌ లా కూడా ఉంటాయి. ఇదిగో ఇది అలాంటి షాకింగ్ కం చిత్ర‌మైన ప్రేమ‌క‌థ‌. ర‌న్‌ వై ప‌రుగెత్తి ప్రేమ‌ను గెలిపించుకునేందుకు చేసిన విజ‌య‌గాథ‌. వివ‌రాల్లోకి వెళితే...అది షార్జా. ఇండియాకు చెందిన 26 ఏళ‌ల్ ఇంజినీర్ ఆర్‌ కే అక్కడ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఎయిర్‌ పోర్ట్‌ కు వచ్చాడు. ఎయిర్‌ పోర్ట్ గోడను దూకాడు. రన్‌ వేపై పరిగెత్తడం ప్రారంభించాడు. రన్‌ వేపై ఉన్న ఇండియాకు వెళ్లే విమానాన్ని ఎక్కబోయాడు.

ఇంతలో అతడిని గమనించిన ఎయిర్‌ పోర్ట్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు ప్రశ్నించగా విస్తుగొలిపే సమాధానాలు చెప్పాడు. "నా ప్రేయసిని కలవడం కోసమే నేను విమానం ఎక్కడానికి ప్రయత్నించాను. నా ప్రేయసిని చూడకుండా నేను ఉండలేను. తనేమో ఇండియాలో ఉంది. నేనేమో ఇక్కడ ఉన్నాను. నా పాస్‌ పోర్ట్‌ ను కంపెనీ తీసేసుకుంది. ఇప్పటికి 15 సార్లు ఇండియా వెళ్లడానికి అనుమతి కోరాను. కంపెనీ ససేమిరా అంది. నా పేరెంట్స్‌ ను ఒప్పించి నా ప్రేయసిని పెళ్లాడాలని అనుకున్నాను. కాని.. ఇండియా వెళ్లే దారేది?. అందుకే.. ఎయిర్‌ పోర్ట్ గోడను దూకి.. రన్‌ వేపై డైరెక్ట్‌ గా వెళ్లి విమానం ఎక్కి ఇండియా వెళ్దామనుకున్నాను. ఒకవేళ నేను దొరికితే.. కోర్టులో నాకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకొని నా పాస్‌ పోర్ట్‌ ను నేను తిరిగి పొందొచ్చు అని ఆలోచించాను`` అంటూ దిమ్మ‌తిరిగిపోయే త‌న స్టోరీని వివ‌రించాడు మ‌నోడు.

అయితే ఈ స్టోరీ ఊహించ‌ని ముల‌పు తిరిగింది మ‌రి. పాస్‌ పోర్ట్ - టికెట్ లేకుండా విమానం ఎక్కడానికి ప్రయత్నించిన ఆర్‌ కే ను వెంటనే పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి వేదనను విన్న జడ్జ్ అతడికి బెయిల్ ఇచ్చి తన పాస్‌ పోర్ట్ తిరిగి ఇచ్చేందుకు కంపెనీతో మాట్లాడారు. మొత్తానికి మనోడి ప్లాన్ సక్సెస్ అవడమే కాదు.. మనోడి కథ కూడా సుఖాంతమయింది. ప్రేమ గెలిచేందుకు కీల‌క ముంద‌డుగు ప‌డింది.