Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయుడి సాహసానికి సాహో

By:  Tupaki Desk   |   2 May 2017 2:13 PM GMT
అమెరికాలో భారతీయుడి సాహసానికి సాహో
X
అమెరికాలో ఒక ప్రవాస భారతీయుడి తెగువ ప్రశంసలందుకుంటోంది. అతను చేసిన సాహసానికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ వన్నవల్లి అనే 34 ఏళ్ల ఎన్నారై.. న్యూయార్క్ నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతను తన కార్యాలయానికి వెళ్లేందుకు శుక్రవారం ఎడిసన్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అతడితో పాటే పని చేసే మాధురి రేచర్ల కూడా ఆ స్టేషన్ కు వచ్చింది. ఐతే దగ్గర్లో రైలు వస్తుండగా.. మాధురి ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడిపోయింది. ఇది గమనించిన అనిల్.. తన బ్యాగును ఫ్లాట్ ఫాం మీద వదిలేసి పట్టాలపైకి దూకాడు. క్షణాల వ్యవధిలో మాధురిని కాపాడి ఫ్లాట్ ఫాం మీదికి తీసుకొచ్చాడు. మరో ఇద్దరు యువకులు అతడికి సాయపడ్డారు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో నీరసం వచ్చి మాధురి పట్టాలపై పడిపోయినట్లు తెలిసింది.

ఐతే మాధురిని కాపాడే హడావుడిలో అనిల్ ఫ్లాట్ ఫాం మీద వదిలేసిన బ్యాగును ఎవరో కొట్టేయడం గమనార్హం. అమెరికాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందులో ఖరీదైన ల్యాప్ టాప్.. కొంత డబ్బు.. ఐడీ కార్డు తదితరాలు ఉన్నాయి. సాయం చేయడానికి బ్యాగు వదిలేస్తే దాన్ని తస్కరించడం ఏంటంటూ ఆ దొంగను తిట్టిపోస్తున్నారు. ఐతే ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సమయోచితంగా స్పందించి మాధురి ప్రాణాలు కాపాడిన అనిల్ కు అమెరికా పోలీసులు అభినందనలతో పాటు వెయ్యి డాలర్ల చెక్కును బహుమతిగా అందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/