Begin typing your search above and press return to search.

కొత్త దేశాన్ని గుర్తించి..రాజుగా ప్ర‌క‌టించుకున్న భార‌తీయుడు

By:  Tupaki Desk   |   15 Nov 2017 3:17 PM GMT
కొత్త దేశాన్ని గుర్తించి..రాజుగా ప్ర‌క‌టించుకున్న భార‌తీయుడు
X
ఓ భార‌తీయుడు విజ‌య‌గాథ ఇది. స‌మ‌స్య‌ల్లోంచి అవ‌కాశాన్ని సృష్టించుకున్న విభిన్న వ్య‌క్తిత్వం క‌ల వ్యక్తి చ‌ర్య‌. ఏకంగా అంత‌ర్జాతీయ స‌మాజం ఆశ్చ‌ర్య‌పోయేలా చేసిన ఉదంతం. ఓ వివాదాస్ప‌ద ప్రాంతాన్ని గుర్తించి...దాన్ని దేశంగా ప్ర‌క‌టించుకొని...త‌న‌ను తాను రాజుగా ప్ర‌క‌టించుకున్నాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే...ఈజిప్టు, సుడాన్‌ దేశాల సరిహద్దుల నడుమ 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కొంత భూభాగం విష‌యంలో మ‌నోడు చేసిన ఘ‌న‌కార్యం ఇది.

ఈజిప్ట్‌-సుడాన్ మ‌ధ్య ఉన్న ఈ స్థలంలో ఉగ్ర‌వాదులు ఆకృత్యాలు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఆ ప్రాంతం త‌మది కాదంటే...త‌మ‌ది కాద‌ని ఆ రెండు దేశాలు వాదించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై క‌న్నేసిన ఇండోర్‌కు చెందిన 24 ఏళ్ల యువ పారిశ్రామిక‌వేత్త సుయాష్ దీక్షిత్ సుదీర్ఘ ప్ర‌యాణం చేసి బిర్‌తావిల్ అనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్క‌డ ఓ జెండా పాతి స్వంతంత్ర దేశంగా ప్ర‌క‌టించాడు. `కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌` అనే పేరును ఖ‌రారు చేసుకొని త‌న‌ను తాను రాజుగా ప్ర‌క‌టించాడు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తన ప్ర‌స్థానం ప్రారంభం అయింద‌ని చెప్పేందుకు చిహ్నంగా ఓ విత్త‌నం నాటి దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక్క‌డితో కూడా మ‌నోడు ఆగి పోలేదండోయ్‌. త‌న తండ్రి జ‌న్మ‌మ‌దినం పుర‌స్క‌రించుకొని ఆ దేశానికి అద్య‌క్షుడిగా ఆయ‌న పేరును ప్ర‌క‌టించాడు. హ్యాపీ బ‌ర్త్‌డే ప‌ప్పా అంటూ తండ్రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో పాటుగా కింగ్‌డ‌మ్ ఆఫ్ దీక్షిత్ అనే త‌న దేశానికి ఆమోద ముద్ర వేయాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. పైగా త‌న‌కు 800 మంది మ‌ద్ద‌తు ప‌లికార‌ని వివ‌రించాడు. మ‌నోడి ఆస‌క్తిక‌ర‌మైన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌ వివరాలు ఇది
దేశం పేరు: కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌,
ప్రస్తుత జనాభా: 1 (అది మ‌నోడు దీక్షితే)
పాలకుడు: సుయాష్‌ రాజు,
రాజధాని: సుయాష్‌పూర్‌,
ఏర్పాటు తేది: నవంబర్‌ 5, 2017
కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌ జాతీయ జంతువు: బల్లి
జెండా: పైన చిత్రంలో కనిపిస్తోంది.