Begin typing your search above and press return to search.

భారత జవాన్ కిడ్నాప్.. ఉగ్రచర్యేనా?

By:  Tupaki Desk   |   4 Aug 2020 9:15 AM IST
భారత జవాన్ కిడ్నాప్.. ఉగ్రచర్యేనా?
X
ఉలిక్కిపడే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. యావత్ దేశం బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవటం తెలిసిందే. కరోనా వేళ.. గతానికి భిన్నంగా ఈసారి బక్రీద్ పూర్తైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవు మీద ఇంటికి వచ్చిన జవాను కనిపించకుండా పోవటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

జమ్ముకశ్మీర్ కు చెందిన షకీర్ మన్ సూర్ భారత ఆర్మీలోని 162 బెటాలియన్ లో పని చేస్తుంటారు. రైఫిల్ మన్ గా వ్యవహరిస్తున్న అతగాడు బక్రీద్ సందర్భంగా సెలవు తీసుకొని సొంతూరుకు వెళ్లాడు. బక్రీద్ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి రాలేదు. అతే సమయంలో కుల్గాం ప్రాంతంలో అతని కారు తగలబడి ఉన్నట్లు గుర్తించారు. దీంతో భారత జవాను కోసం వెదుకులాటను మరింత వేగిరం చేశారు.

గాలింపు చర్యల్లో భాగంగా స్థానిక పోలీసుల వద్ద ఉన్న డ్రోన్స్ తోపాటు కుక్కల్ని కూడా రంగంలోకి దించారు. ఇదిలా ఉంటే షకీర్ ప్రాణాలకు అపాయం కలుగకుండా చేయాలని ఉగ్ర సంస్థల్ని అతని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోయిన షకీర్ ను ఉగ్రసంస్థలు కిడ్నాప్ చేసి ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు షకీర్ కనిపించకుండా పోయిన వైనాన్ని చూస్తే.. .ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అతని ఆచూకీ కోసం సైన్యం.. అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతడు క్షేమంగా బయట పడాలని మనసారా కోరుకుందాం.