Begin typing your search above and press return to search.

నో చెప్పినా ముద్దు పెట్టిన భారతీయుడికి 7 నెలలు జైలు

By:  Tupaki Desk   |   21 Oct 2020 12:20 PM IST
నో చెప్పినా ముద్దు పెట్టిన భారతీయుడికి 7 నెలలు జైలు
X
దేశం కాని దేశంలో బతుకుతున్న వేళ.. తాము చేసే తప్పులకు దేశం పేరు తెర మీదకు వస్తుందన్న కనీసం ఇంగితాన్ని చాలామంది మర్చిపోతుంటారు. దీంతో.. వారు చేసిన నేరానికి వ్యక్తిగతంగా అనుభవించటమే కాదు.. దేశం మీదా అంతో ఇంతో ప్రభావితం అవుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. సింగపూర్ దేశంలో ఉంటున్న ఉంటున్న భారతీయుడు 26ఏళ్ల చెల్లం రాజేశ్ కన్నన్. అతగాడికి పెళ్లై.. ఒక కుమార్తె కూడా ఉంది. ఇదిలా ఉంటే గత ఏడాది అతడికి సోషల్ మీడియా ద్వారా పదిహేనేళ్ల బాలిక పరిచయమైంది.

ఒకరికొకరు మెసేజ్ లు పంపుకునే వారు. గత ఏడాది ఆగస్టులో కన్నన్ ఆ బాలికను కలిశాడు. ఆ తర్వాత మరోసారి కలవటానికి సదరు బాలిక ఒప్పుకుంది. దీనికి మూడు రోజుల ముందు తన స్నేహితుల కోసం మద్యం తీసుకురావాలని కోరింది. బాలిక చెప్పినట్లుగా మద్యం తీసుకెళ్లిన రాజేశ్.. అవిచ్చే క్రమంలో ఆమెను ముద్దు పెట్టుకోవాలని కోరాడు. అందుకు ఆమె నో చెప్పింది.

అయినప్పటికీ వినని రాజేశ్.. ఆ మైనర్ బాలికను బలవంతంగా ముద్దు పెట్టేశాడు. ఆమె చెప్పినట్లుగా మద్యం తెచ్చినందుకు.. తనతో లైంగిక చర్యకు సహకరించాలని బలవంతంగా చేశాడంటూ ఆ మైనర్ బాలికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది కాస్తా కేసు అయ్యింది. పరువు పోవటమే కాదు.. ఉద్యోగం పోయింది. భార్య వెళ్లిపోయింది. మొత్తంగా అప్పటివరకు ఏ చింత లేకుండా సాగుతున్న అతడి జీవితం.. దారుణంగా తయారైంది.

అతగాడి కేసు విచారణకు వచ్చింది. సింగపూర్ లాంటి దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న తప్పులకే భారీ శిక్షలు వేస్తుంటారు. తాను చేసిన పనికి తాను తీవ్రంగా పశ్చాతాపం చెందుతున్నట్లుగా కోర్టుకు చెప్పటమే కాదు.. తాను మూడేళ్లుగా సింగపూర్ లో ఉంటున్నానని.. ఏ తప్పు చేయలేదన్నాడు. తాను చేసిన తప్పునకు క్షమించాలని.. తాను తీవ్రమైన పశ్చాతాపం చెందుతున్నట్లు చెప్పాడు. ఇప్పటికే తన ఉద్యోగం.. భార్య.. కుమార్తె దూరమైన విషయాన్ని పేర్కొన్నాడు. ఈ కేసుతో తానెన్నో బాధల్ని అనుభవించినట్లుగా పేర్కొన్నాడు. అతడి వాదనలు విన్న కోర్టు.. అతడికి ఏడు నెలలు జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. తొందరపాటుతో.. కామంతో చేసిన ఒక చేష్ట జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో ఈ ఉదంతం చెప్పకనే చెబుతుందని చెప్పాలి.