Begin typing your search above and press return to search.

ఐటీలో కొలువు కావాలా?..ఆర్నెళ్లు ఆగాల్సిందే

By:  Tupaki Desk   |   11 Oct 2017 4:59 PM GMT
ఐటీలో కొలువు కావాలా?..ఆర్నెళ్లు ఆగాల్సిందే
X
ఉద్యోగాల క‌ల్ప‌న‌లో టాప్‌ లో ఉన్న‌ప్ప‌టికీ...ఇటీవ‌లి కాలంలో నిరాశ‌భ‌రిత‌మైన‌ స‌మాచారానికి వేదిక‌గా మారిన ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగం మ‌రోమారు అదే త‌ర‌హా వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది. స‌రైన అర్హ‌త‌లు క‌లిగి ఉంది మీరు కానీ మీ స్నేహితులు కానీ..లేదా ప‌రిచ‌య‌స్తులు కానీ...సాఫ్ట్‌ వేర్‌ రంగంలో మంచి జాబ్‌ కోసం చూస్తున్నారా! అయితే అందుకు ఇది మంచి సమయం కాదు. ఎందుకంటే వచ్చే ఆరు మాసాల్లో ఐటీ రంగంలో నియామకాల జోరు తగ్గుతోంది. కొత్తగా నియామకాలు చేపట్టాలని మెజారిటీ ఐటీ కంపెనీలు భావించడం లేదని సర్వేలో వెల్లడైంది. ఎక్స్‌ పెరిస్‌ ఐటీ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌ లుక్ అనే స‌ర్వేలో ఈ విష‌యాలు తేలాయి.

దాదాపు 500 కంపెనీలపై ఎక్స్‌ పెరిస్‌ ఐటీ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌ లుక్ సర్వే నిర్వ‌హించి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం....గత త్రైమాసికంతో పోలిస్తే అక్టోబరు-మార్చి కాలంలో ఐటి రంగంలో నియామకాలు చాలా పేలవంగా ఉన్నాయ‌ట‌. ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా కొత్తగా ఉద్యోగులను తీసుకోవాలని కేవలం 50శాతం భారతీయ ఐటీ కంపెనీలే భావిస్తున్నాయ‌ట‌. అదే ఏప్రిల్‌ నుండి సెప్టెంబరు వరకు చూసినట్లైతే 58 శాతం కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టాయని ఎక్స్‌ పెరిస్‌ ఐటీ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌ లుక్‌ సర్వే వెల్లడించింది. ఈ స‌ర్వే సంస్థ‌కు దాదాపు అన్ని కేటగిరీల్లోనూ ఉద్యోగులను తీసుకునే యోచన విరమించినట్టు మ్యాన్‌ పవర్‌ గ్రూపు తెలిపింది. కొత్తగా ఎవరినీ తీసుకోకుండా పాతవారికే వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు 57శాతం మంది చెప్పారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఉపాధి మార్కెట్‌ కుంచించుకుపోతుందని, కంపెనీలు మూతపడ తాయని భారత ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. సుశిక్షితులైన ఐటీ గ్రాడ్యుయేట్లను మాత్రమే తీసుకోవాలని యోచిస్తున్నాయని సర్వే నివేదిక వెల్లడిం చింది.

ఇక‌ ఐటీ సేవల కంపెనీల్లో కూడా హైరింగ్‌ (ఉద్యోగ నియామకాలు) ఆలోచనలు గణనీయంగా పడిపోయాయని, గత అర్ధ సంవత్సర కాలంలో హైరింగ్‌ 22శాతంగా వుండగా అక్టోబరు-మార్చి మధ్య 9 శాతానికి పడిపోవచ్చని నివేదిక పేర్కొంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ - సాఫ్ట్‌ వేర్‌ సేవలందించేవారికి అత్యధికంగా డిమాండ్ ఉండవచ్చునని, ఆ తర్వాతి స్థానం డేటా అనలిస్ట్‌ లదేనని సర్వేవివరించింది. కొత్తగా వచ్చేవారికే మంచి అవకాశాలు ఉంటాయని వివ‌రించింది.. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా దక్షిణాదిన పటిష్టమైన లేబర్‌ మార్కెట్ ఉండవచ్చునని పేర్కొంది. అసలే అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో ఉన్నవాటిలో మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవాలంటే అసాధారణమైన తెలివి తేటలు - అనూహ్యమైన వేగం - ఖచ్చితత్వం - సమర్ధత వంటివి చాలా కీలకమైన అంశాలుగా మారనున్నా యని మేన్‌ పవర్‌ గ్రూప్‌ ఇండియా అధ్యక్షుడు మన్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ మార్పుతో ఈ సాంకేతిక సంస్థలన్నీ వినూత్నమైన నైపుణ్యాల కోసం వెతుకుతున్నాయని, అటువంటి వృత్తిరీత్యా నిపుణులైన యువతకు వచ్చే రెండేళ్ళ కాలంలో భారత ఐటీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంటుందని సింగ్ వెల్ల‌డించారు.