Begin typing your search above and press return to search.

టెకీలు..చైనా బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తోంది

By:  Tupaki Desk   |   31 May 2017 4:33 AM GMT
టెకీలు..చైనా బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తోంది
X
అంత‌ర్జాతీయ నెల‌కొన్న ప‌రిణామాలు, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌1బీ వీసాల జారీని క‌ఠిన‌త‌రం చేయ‌డంతో ఐటీ ఇండస్ట్రీలో ప‌నిచేస్తున్న భార‌తీయుల భ‌విత‌వ్యం, భారత్‌ కు చెందిన ఐటీ కంపెనీల భ‌వితవ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ప‌లు దేశాల్లో స్థానికుల‌కే పెద్ద పీట అనే ఎజెండాతో ముందుకు సాగుతున్న నేప‌థ్యంలో కొలువులు క‌ల్పించే దేశాల‌పై న‌జ‌ర్ ప‌డుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా భార‌త ఐటీ సంస్థ‌లు మ‌రో ప్ర‌త్యామ్నాయంగా చైనా వైపు చూస్తున్నాయి.

దేశీయ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో కీల‌క వేదిక అయిన నాస్కామ్ నేతృత్వంలో ప‌లు కంపెనీల‌కు చెందిన బృందం చైనాలో ప‌ర్య‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా డేటా బిజినెస్‌ లో పెట్టుబ‌డులు పెట్టాల్సిందిగా భార‌త ఐటీ సంస్థ‌ల‌కు చైనా మంచి ఓపెన్‌ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో ఐటీ ప‌రిశ్ర‌మ క‌న్ను ఇప్పుడు డ్రాగ‌న్ కంట్రీపై ప‌డింది. ఐటీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు చైనాలో మంచి అవ‌కాశం ఉందని నాస్కామ్ డైరెక్ట‌ర్ గ‌గ‌న్ స‌బ‌ర్వాల్ అన్నారు. చైనా కంపెనీలు కూడా భార‌త్‌లోని స్టార్ట‌ప్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. చైనాలో భార‌త ఐటీకి సంబంధించి ఇత‌ర అవ‌కాశాలున్నాయ‌ని గ‌గ‌న్ స‌బ‌ర్వాల్ తెలిపారు.

కాగా, ఇటీవ‌లే చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌ ప్ర‌ముఖ ఐటీ సంస్థ అయిన నిట్ ఛైర్మ‌న్ రాజేంద్ర ప‌వార్‌ను ఆహ్వానించింది. అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో క‌లిసి డేటా బిజినెస్‌ లో చేప‌డుతున్న ప్రాజెక్టుల డెవ‌ల‌ప్‌ మెంట్‌ లో త‌మ అడ్వైజ‌రీ క‌మిటీలో స‌భ్యులుగా ఉండి అమూల్య‌మైన సూచ‌న‌లు చేయాల్సిందిగా గుయిజౌ ప్రావిన్స్ ప్ర‌భుత్వం రాజేంద్ర ప‌వార్‌ ను కోరింది. ప‌లు వృద్ధి చెందిన దేశాలు సాంకేతికంగా మ‌రింత ముందుకు దూసుకుపోవ‌డంలో భార‌త ఐటీ రంగం కృషి ఎంతో ఉందని గ‌మ‌నించిన చైనా..ఆ దిశ‌గా త‌మ దేశంలో కూడా భార‌త ఐటీ స‌హ‌కారంతో అద్భుతాలు చేయాల‌ని భావిస్తోంద‌ని రాజేంద్ర ప‌వార్ తెలిపారు. ఈ ప‌రిణామం దేశీయ టెకీల‌కు మంచి అవ‌కాశాలను క‌ల్పిస్తుంద‌ని వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/