Begin typing your search above and press return to search.
అమెరికా జడ్జీ రేసులో భారతీయుడు
By: Tupaki Desk | 20 Sept 2020 3:20 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అనుకోని సంఘటన జరిగింది. దేశ అత్యున్నత న్యాయస్తానమైన అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రూత్ మరణించారు. దీంతో ఈ ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రక్రియ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన అముల్ థాపర్ అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవి రేసులో ఉన్నట్టు సమాచారం.
ట్రంప్ వద్ద ప్రస్తుతం 20 మంది సమర్థులైన జడ్జీల జాబితా ఉందని.. అందులో థాపర్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. 51 ఏళ్ల థాపర్ ప్రస్తుతం అమెరికా సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
అమెరికా ఎన్నికలు సమీపిస్తుండడంతో పెద్ద ఎత్తున ఉన్న ఇండియన్ల మద్దతు కోసం ట్రంప్ భారతీయుడికి పట్టం కట్టే అవకాశాలున్నాయని అక్కడి మీడియా అంచనా వేస్తోంది.