Begin typing your search above and press return to search.
రైతులకి తీపికబురు ..త్వరలో బియ్యం నుండి బీరు తయారు !
By: Tupaki Desk | 23 Jun 2020 3:20 PM ISTదేశంలో నానాటికి వరి దిగుబడి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నాణ్యమైన వరి ధాన్యం ఎక్కువగా పండిస్తున్నారు. రైతులు పండించిన వరి పంటను తప్పనిసరిగా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో మూడేళ్లకు సరిపడా వరి నిల్వలు ఉన్నాయి. గోదాముల్లో నిల్వలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. గతంలో ఆఫ్రికా దేశాలకు వరిని ఎక్కువగా ఎగుమతి చేసేవారు. ఇప్పుడు ఎగుమతి తగ్గిపోయింది.
ఆఫ్రికాలోని పలు దేశాల్లో వరిని పండించడమే దీనికి ప్రధాన కారణం. దీనితో గోదాముల్లో ధాన్యం వృధాగా పోకుండా ఉండేందుకు కేంద్రం ఓ సరికొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. వరి నుంచి మొలాసిస్ ను తయారు చేసి దానిని బీర్ గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని చూస్తున్నది. ప్రపంచంలో మంచినీళ్ల తరువాత అత్యధికంగా బీర్ ను తాగుతున్నారు. నాణ్యమైన బీర్ కు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉన్నది. దీంతో డిమాండ్ కు తగ్గట్టుగా ఇలా బీర్ ను తయారు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీని నుంచి కేంద్రానికి వచ్చే రాబడిని బట్టి రైతులకు మద్దతు ధరను కూడా పెంచుతారట.