Begin typing your search above and press return to search.

కరోనా మీ వల్లే.. చైనా అధ్యక్షుడిపై కేసు

By:  Tupaki Desk   |   17 March 2020 9:30 PM GMT
కరోనా మీ వల్లే.. చైనా అధ్యక్షుడిపై కేసు
X
కరోనా వైరస్ పుట్టిన చైనా పై ఆదినుంచి అనుమానాలున్నాయి. ఈ జీవాయుధాన్ని ఇతర దేశాలపై ప్రయోగించి సొమ్ము చేసుకుందామని రెడీ చేసిందని అమెరికా కు చెందిన ప్రముఖులు, మీడియా కోడై కూసింది. అయితే అది లీక్ అయ్యి అక్కడ మరణాలు సంభవించాయని.. ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తోందని ఆడిపోసుకున్నారు.

చైనా అక్రమంగానే ఈ వైరస్ తయారు చేసిందన్న అపవాదు ఉన్నా ఇప్పటివరకూ దీనిపై చైనా ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు వ్యతిరేకంగా తాజాగా భారత్ లో కేసు నమోదైంది. బీహార్ లోని ముజఫర్ పూర్ కోర్టులో ఓ వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తోపాటు భారత్ లో చైనా రాయబారి సన్ వేడాంగ్ పేరు కూడా ఈ పిటీషన్ లో పేర్కొని కరోనాని పుట్టించింది చైనీయులేనని.. చర్యలు తీసుకోవాలని సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 11న విచారిస్తామని తెలిపింది.