Begin typing your search above and press return to search.

సూపర్ స్పీడుతో భారత ఆర్థిక వ్యవస్థ

By:  Tupaki Desk   |   19 Nov 2020 6:29 PM GMT
సూపర్ స్పీడుతో భారత ఆర్థిక వ్యవస్థ
X
భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా వృద్ధిని నమోదు చేస్తోందని బార్క్ లేస్ నివేదిక తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును గతంలో 7శాతం అంచనావేయగా.. ఈసారి 8.5శాతానికి సవరించింది.

ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమైన నేపథ్యంలో వచ్చే ఏడాది వృద్ధి రేటు గతంలో కంటే పెరుగుతుందని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయని పేర్కొంది.

కరోనా ఎఫెక్ట్ నుంచి భారత్ ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటోందని గతంలో మూడీస్, గోల్డ్ మన్ శవాక్స్ కూడా తెలిపాయి. ఈ మేరకు వృద్ధిరేటు అంచనాలు సవరించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ రేటును మరింత ప్రతికూతలకు సవరించింది. వృద్ధిరేటును 6 శాతం నుంచి మైనస్ 6.4శాతానికి సవరించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ లో వృద్ధిరేటు మైనస్ 8.5శాతంగా ఉంటుందని అంచనా వేసింది. జూలై-సెప్టెంబర్ లో భారత జీడీపీ మైనస్ 8.6శాతంగా ఉంటుందని ఆర్బీఐ కూడా అంచనావేసింది.

కరోనా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్యాకేజీ, చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీకి తోడ్పడుతున్న సంకేతాలు కనిపిస్తాయి.