Begin typing your search above and press return to search.

ఫ్లైట్లో పోయే ప్రాణాన్ని కాపాడిన మన డాక్టర్

By:  Tupaki Desk   |   7 March 2017 7:07 AM GMT
ఫ్లైట్లో పోయే ప్రాణాన్ని కాపాడిన మన డాక్టర్
X
అనుకోని విధంగా ఏదైనా జరిగినప్పుడు.. సమర్థవంతంగా స్పందించటానికి మించింది మరొకటి ఉండదు. తాజాగా మన దేశానికి చెందిన మహిళా వైద్యురాలు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. అందరి మెప్పు పొందుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉదంతాన్ని చూస్తే..

న్యూజిలాండ్ లోని అక్లాండ్ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్ కు మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం వెళుతోంది. భూమికి వేల అడుగుల దూరంలో ప్రయాణిస్తున్న ఆ విమానంలో ఎయిర్ హోస్టెస్ అకస్మాత్తుగా పడిపోయారు. ఆమెకు ఏమైందో తెలీని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయటానికి కనీసం రెండు గంటల సమయమైనా పట్టే పరిస్థితి. అంత వైద్యం అందటం ఆలస్యమైతే.. ప్రాణం పోయే ప్రమాదం పొంచి ఉంది.

ఇలాంటి వేళ సాయం చేసే వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రకటన వెలువడింది. దీనికి వెంటనే స్పందించారు భారతీయ వైద్యురాలు డాక్టర్ సంచిత. మెడికల్ కిట్ తెప్పించి.. ఎయిర్ హోస్టెస్ ను పరిశీలించి ఆమెకు వైద్యం చేశారు. కాసేపటికే కోలుకున్న ఎయిర్ హోస్టెస్.. కళ్లు తెరిచింది. అప్పటివరకూ తీవ్ర టెన్షన్ కు గురైన ప్రయాణికులు.. ఒక్కసారిగా ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. ఈ విషయాన్ని డాక్టర్ అంచిత భర్త కుమార్ ఫేస్ బుక్ లో వెల్లడించారు. తన భార్య చేసిన పని పట్ల తాను చాలా గర్వపడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇది జరిగిన తర్వాత.. విమాన పైలెట్ అంచిత వద్దకు స్వయంగా వచ్చి థ్యాంక్స్ చెప్పారని.. ఆ విషయాన్ని తెలుసుకున్న తాను చాలా సంతోషానికి గురైనట్లుగా వెల్లడించిన కుమార్.. తన భార్యను పొగిడేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/