Begin typing your search above and press return to search.

బుమ్రా మ‌న‌సు దోచిన సంజ‌నా‌.. ఆమె మీక్కూడా తెలుసు.. గుర్తు ప‌ట్ట‌లేదంతే!

By:  Tupaki Desk   |   16 March 2021 1:14 PM GMT
బుమ్రా మ‌న‌సు దోచిన సంజ‌నా‌.. ఆమె మీక్కూడా తెలుసు.. గుర్తు ప‌ట్ట‌లేదంతే!
X
టీమిండియా స్పీడ్ స్ట‌ర్ బుమ్రా ఓ ఇంటివాడ‌య్య‌డు. ఈ వార్త‌లు కొన్ని రోజులుగా మీడియా, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. సంజ‌నా గణేష‌న్ అనే యువ‌తి చేయి ప‌ట్టి ఏడ‌డుగులు వేశాడు జ‌స్ప్రీత్. ఈ నెల 14న వీరి వివాహం జ‌రిగింది. అయితే.. బుమ్రా పెళ్లి చేసుకున్న సంజ‌నా ఎవ‌రు అంటూ ఆన్ లైన్లో వెత‌క‌డం మొద‌లు పెట్టారు ఫ్యాన్స్‌. కానీ.. చాలా మంది గుర్తించ‌లేక‌పోయిన విష‌యం ఏమంటే.. ఈమె చాలా మందికి తెలుసు. కాక‌పోతే వాళ్లు గుర్తు ప‌ట్ట‌లేదంతే!

సంజ‌నా గ‌ణేష‌న్ ఓ స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్టు. మ‌హారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజ‌నా ఇంజ‌నీరింగ్ చ‌దివింది. ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా సీజన్‌-7 ద్వారా త‌న కెరీర్ మొద‌లు పెట్టింది. ఐపీఎల్ తోపాటు ప‌లు స్పోర్ట్స్ ఈవెంట్ల‌కు ప్ర‌జెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలోనే బుమ్రాతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ప్రేమ‌గా మారింది, పెళ్లికి కూడా దారితీసింది.

గ‌తేడాది దుబాయ్ లో జ‌రిగిన ఉమెన్స్ టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి ప్ర‌జెంట‌ర్ గా కూడా ప‌నిచేశారు సంజ‌నా. 2019 క్రికెట్ వ‌రల్డ్‌ క‌ప్ లో ‘మ్యాచ్ పాయింట్’, ‘చీకీ సింగిల్స్’ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా.. ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ వంటి ఇతర క్రీడలకు సైతం హోస్ట్ ఉన్నారు సంజనా. ఐపీఎల్ లో కేకేఆర్ ‘ద నైట్ క్లబ్’ కార్యక్రమానికి యాంకర్ గానూ వ్యవహరించారు. కాబ‌ట్టి.. దాదాపుగా క్రికెట్ ల‌వ‌ర్స్ అంద‌రూ సంజ‌నాను చూసి ఉంటారు.

ఇంతేకాదు.. ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియా‌లో ఫుల్ క్రేజ్ ఉంది. దీనికి కార‌ణాలు చాలా ఉన్నాయి. 2012లో ఫెమినా స్టైలిష్ దివాలో ఫైన‌లిస్టుగా నిలిచారు. అంతేకాదు.. 2013లో ఫెమీనా మిస్ ఇండియా పుణె కిరీటం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత 2014లో ఓ డేటింగ్ రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇన్ స్టాలో ఈ అమ్మ‌డికి దాదాపు 1.43 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

కాగా.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు బుమ్రా, సంజ‌నా. ‘‘ప్రేమికులుగా ఉన్న మేము కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం. మా జీవితాల్లో సంతోషకరమైన రోజుల్లో ఇది ఒకటి. మా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. జస్ ప్రీత్ అండ్ సంజనా’’ అని ఇన్ స్టా లో పోస్ట్ చేశారు.