Begin typing your search above and press return to search.

విదేశీ కంపెనీలకు భారత సీఈవోలు

By:  Tupaki Desk   |   3 Sep 2022 6:37 AM GMT
విదేశీ కంపెనీలకు భారత సీఈవోలు
X
వాళ్లంతా భారత్ లో చదువుకొని.. భారత్ లో ఎదిగి.. భారత్ వల్లే ఇప్పుడు అత్యున్నత హోదాలో ఉన్నారు. మైక్రో సాఫ్ట్ సీఈవో ఎవరు..? సత్యానాదెళ్ల. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవో ఎవరు..? అదీ మనోడే.. సుందర్ పిచాయ్. వీరిద్దరే కాదు.. అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా వీరేకాదు.. చాలా ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు మన భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. సత్తా చాటుతున్నారు.

ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సంస్థకు సీఈవోగా మరో భారతీయుడు నియామకం అయ్యాడు. స్టార్‌బక్స్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా లక్ష్మణ్ నరసింహన్‌ను నియమించుకున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది, ప్రపంచంలోని అతిపెద్ద కాఫీ చైన్‌కు ఆయనను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తోంది. ఏప్రిల్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రపంచంలోనే ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఫెడెక్స్ కు సీఈవోగా మన రాజ్ సుబ్రమణియం సత్తా చాటుతున్నారు. ఆయన సారథ్యంలో కంపెనీ లాభాల బాటలో పయనిస్తోంది.
ఇక ఫ్యాషన్ కంపెనీ 'ఛానల్'ను మన భారతీయురాలు లీనానాయర్ నిర్వహిస్తోంది. ఈమె సారథ్యంలో కంపెనీ వస్త్ర రంగంలో టాప్ లోకి చేరుకుంది.

-ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ అడోమ్ ఇంక్ ను నడిపించేది మన 'శంతను నారాయణ్' కావడం విశేషం. ఈ కంపెనీని టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటిగా ఈయన నిలబెట్టాడు.

-ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ 'ఐబీఎం'ను అర్వింద్ కృష్ణ నిర్వహిస్తున్నారు. ఆయన సారథ్యంలో కంపెనీ లాభాల బాటపట్టింది.

-సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మైక్రాన్ సీఈవోగా మన ప్రవాస భారతీయుడు సంజయ్ మెహ్రోత్రా దిగ్విజయంగా నడిపిస్తున్నారు.

-సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్ వర్క్స్ ను మన 'నికేష్ అరోరా' బాగా ముందుకు తీసుకెళుతున్నారు.

-కంప్యూటర్ నెట్ వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్ వర్క్స్ ను జయశ్రీ ఉల్లాల్ లాభాల బాటలో పయనింపచేస్తున్నారు.

-మన దక్షిణాదికి చెందిన జార్జ్ కురియన్ నెట్ యాప్ అనే 'హైబ్రీడ్ క్లౌడ్ డాటా సర్వీస్ కంపెనీ'ని ప్రపంచంలోనే మెరుగైన కంపెనీగా తీర్చిదిద్దాడు.

-ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 'ఫ్లెక్స్' ను రేవతి అద్వైతి అద్భుతంగా నడిపిస్తూ టాప్ లో నిలిపారు..

-వీడియో హోస్టింగ్ కంపెనీ 'విమియో' గురించి తెలియని వారుండరు. దాన్ని నడిపించే సీఈవో మన 'అంజలి సుద్' కావడం విశేషం.

-క్లౌండ్ కంప్యూటింగ్ కంపెనీ 'వీఎంవేర్'ను మన భారతీయ రఘు రఘురామ్ సీఈవోగా అద్భుతంగా నడిపిస్తున్నారు.

-ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ 'నోవార్టీస్'ను వసంత్ నరసింహన్ సీఈవో సారథ్యంలో వందల కోట్లకు ఎదిగేలా చేశారు.

-ప్రొఫెషనల్ సర్వీస్ నెట్ వర్క్ 'డెలాయిట్'ను పునీత్ రెంజెన్ ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీగా నిలిపారు.

-యూనివర్సల్ బ్యాంక్ 'బార్ క్లేస్'కు కూడా మన భారతీయుడైన సీఎస్ వెంకట కృష్ణన్ సీఈవోగా టాప్ ప్లేసులో నిలిపాడు..

ఇలా మనకు తెలిసిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ సీఈవోలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలను మన భారతీయులే నడిపిస్తున్నారు. ఎన్నో దిగ్గజ అమెరికన్ విదేశీ కంపెనీలకు సారథులుగా ముందుడి వ్యవహరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.