Begin typing your search above and press return to search.

గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ .. ఏమైందంటే !

By:  Tupaki Desk   |   12 Nov 2020 3:00 PM IST
గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ .. ఏమైందంటే !
X
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు మరో భారీ షాక్ . ఇండియన్‌ బ్యాంకుకు రుణం ఎగవేత వ్యవహారంలో గంటా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యూష కంపెనీ కోసం తీసుకున్న రుణం వడ్డీ సహా రూ.248.03 కోట్లు అయ్యింది.. ఆ డబ్బు చెల్లించకపోవడంతో బ్యాంకు యాజమాన్యం బకాయిలను రాబట్టే చర్యలకు సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను ఈనెల 25న వేలం వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఈ–ఆక్షన్‌ సేల్‌ నోటీసును హైదరాబాద్ ‌లోని ఇండియన్‌ బ్యాంకు సామ్ బ్రాంచ్‌ జారీ చేసింది.

గతంలో రూ. 248 కోట్ల రూపాయల మేర ప్రత్యూష క౦పెనీ బ్యాంక్ రుణం తీసుకుంది. ఆ లోన్ తాలూకా వడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. మెుదటిసారిగా 2006 అక్టోబర్ 4న రుణ౦ చెల్లి౦చాల౦టూ బ్యాంకు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాని క్రమంలో.. 2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో ప్రత్యూష కంపెనీ కుదవ బెట్టిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని కీలకమైన ప్రాంతాలలో ఉన్న భవనాలు, రుషికొండ వద్ద ఉన్న స్థలాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాను సంస్థ డైరెక్టర్‌ పదవి నుంచి 2011 సంవత్సరంలోనే తప్పుకున్నానని, ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు.