Begin typing your search above and press return to search.

టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాలో మ‌నోళ్లు ఇద్ద‌రు!

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:09 AM GMT
టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితాలో మ‌నోళ్లు ఇద్ద‌రు!
X
ఆస‌క్తిక‌ర అంశాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు తాజా జాబితాల్ని వెల్ల‌డించే ఫోర్బ్స్‌.. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర అంశానికి సంబంధించిన లిస్ట్ ను విడుద‌ల చేసింది. ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తు ఉన్న శ‌క్తివంత‌మైన సంప‌న్నుల‌కు సంబంధించి ఒక జాబితాను రెఢీ చేసింది. దీని ప్ర‌త్యేక‌త ఏమంటే.. ఇందులో కేవ‌లం బిజినెస్ ఉమెన్స్ మాత్ర‌మే కాదు.. యాక్టింగ్‌.. క్రీడ‌ల‌కు సంబంధించిన ప్ర‌ముఖులు కూడా ఉంటారు.

మ‌న దేశానికి చెందిన 22 మంది టైకూన్స్ ఆఫ్ టుమారో పేరుతో విడుద‌ల చేసిన జాబితాలో తెలుగు ప్రాంతానికి చెందిన ముగ్గురు మ‌హిళా ప్ర‌ముఖులు చోటు సాధించారు. ఇందులో ఒలంపిక్ ప‌త‌క విజేత పీవీ సింధుకు స్థానం ల‌భించింది. ఆమెతో పాటు ఉపాసన, అనన్య బిర్లా ల‌కు స్థానం ల‌భించింది.

నిక‌ర సంప‌ద‌ను ప్రామాణికంగా తీసుకోకుండా ఈ జాబితాను రూపొందించారు. త‌మ రంగాల్లో ప్ర‌తిభ చూపుతున్న కుటుంబ వ్యాపారాలు నిర్వ‌హిస్తున్న వారి వార‌సులు.. తొలిత‌రం వాణిజ్య వేత్త‌లు.. న‌ట‌లు..క్రీడాకారులు ఈ జాబితాలో ఉన్నారు.

+ అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరణ్‌ అదానీ

+ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ గోయెంకా

+ ఫ్యూచర్‌ కన్జూమర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆశ్ని బియానీ

+ బిర్లా వారసురాలు, క్యూరోకార్ట్‌-ఎంపవర్‌ సహ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా

+ యెస్‌ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ కుమార్తె రాధా కపూర్‌

+ పార్లే ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్‌

+ పీవీ సింధు

+ ఐడి ఫ్రెష్‌ ఫుడ్‌ సహ వ్యవస్థాపకులు పీసీ ముస్తాఫా

+ ఫ్రెష్‌ వర్క్స్‌ వ్యవస్థాపకులు గిరీశ్‌ మాతృబూథమ్‌

+ జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్‌ కామత్‌ - నితిన్‌ కామత్‌

+ మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ అమీరా షా

+ బిబా ఆపెరల్‌ ప్రతినిధి సిద్ధార్థ బింద్రా

+ సియట్‌ అనంత్‌ గోయెంకా

+ అపోలో హాస్పిటల్స్‌ నుంచి ఉపాసనా కామినేని కొణిదెల

+ యూపీఎల్‌ నుంచి విక్రమ్‌ ష్రాఫ్‌

+ లోధా గ్రూప్‌నకు చెందిన అభిషేక్‌ లోధా

+ క్లియర్‌ట్యాక్స్‌ వ్యవస్థాపకులు అర్చిత్‌ గుప్తా

+ మాసివ్‌ రెస్టారెంట్స్‌ వ్యవస్థాపకులు జొరావర్‌ కల్రా

+ విక్కీ కౌశల్ (సినిమా రంగం)

+ భూమి పడ్నేకర్ (సినిమా రంగం)

+ బిరా 91 బీర్‌ వ్యవస్థాపకులు అంకుర్‌ జైన్‌

+ ఓయో రూమ్స్‌ రితేశ్‌ అగర్వాల్‌