Begin typing your search above and press return to search.

దాయాది భూభాగంలోకి వెళ్లిన భారత సైన్యం.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   2 Dec 2020 9:33 AM IST
దాయాది భూభాగంలోకి వెళ్లిన భారత సైన్యం.. ఎందుకంటే?
X
కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించటం.. వారిని భారత సైన్యం మట్టుబెట్టటం తెలిసిందే. భారత భూభాగంలోకి ఎలా వచ్చారు? అన్న ప్రశ్న వేసుకున్న భద్రతాదళాలు.. దాని సంగతి తేల్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఈ సందర్భంగా వారొక సొరంగాన్ని గుర్తించారు. అందులోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లు.. పాక్ భూభాగంలోకి తాము వెళ్లినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ అస్తానా వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ లోని నగ్రోటాలోనికి పాక్ కు చెందిన జైషే ఉగ్రవాదులు నలుగురు అక్రమంగా చొచ్చుకొచ్చారు. వీరిని గుర్తించిన భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఆ నలుగురు మరణించారు. వారి నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు భారత్ లోకి ఎలా వచ్చారన్న అంశాన్ని గుర్తించేందుకు గాలింపు జరపగా.. ఒక సొరంగాన్ని గుర్తించారు.

ఇందులోకి ప్రయాణించిన భారత జవాన్లకు.. దాని ఆరంభం పాక్ భూభాగంలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో భారత జవాన్లు పాక్ భూభాగంలోని 200 మీటర్లు వెళ్లినట్లుగా గుర్తించారు. అలా సొరంగంలో గుండా పాక్ భూభాగంలోకి వెళ్లిన మనోళ్లు.. తిరిగి వచ్చేటప్పుడు ఆ సీన్లను రికార్డు చేశారు. ఉగ్రవాదుల కుతంత్రాల్ని తెలియజేసేందుకు వీలుగా.. ఆ మొత్తాన్ని రికార్డు చేసినట్లుగా ఆయన చెప్పారు.