Begin typing your search above and press return to search.

సిక్కింలోకి దూసుకొచ్చిన చైనా.. ముక్కు పగులగొట్టిన సైన్యాధికారి

By:  Tupaki Desk   |   24 Jun 2020 10:30 AM GMT
సిక్కింలోకి దూసుకొచ్చిన చైనా.. ముక్కు పగులగొట్టిన సైన్యాధికారి
X
చైనా రెచ్చగొట్టే చర్యలు మానుకోవడం లేదు. భారత భూభాగంలోకి చొచ్చుకొని వస్తోంది. లడక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తనలో కలుపుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే తరచూ సరిహద్దులను దాటుకుని చైనా భారత భూభాగంలోకి వస్తోంది. ఎలాగైనా ఈ ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల సిక్కింలో చైనా బలగాలు ఆ విధంగా చేస్తే మన సైనికులు వారిని వెళ్లగొట్టారు. వినకపోతే ముక్కు పగలగొట్టి మరి తరిమికొట్టారు.

సిక్కింలో తమ భూభాగం అని చైనా వాదించగా దానికి ధీటైన జవాబు చెప్పాడు భారత లెఫ్ట్ నెంట్ అధికారి. సిక్కింలో భారత గస్తీ దళానికి యువ లెఫ్ట్ నెంట్ అధికారి బిరోల్ దాస్ నేతృత్వం వహిస్తున్నాడు. చైనా మేజర్ వెనక్కి తగ్గకుండా వాదనకు దిగడంతో పాటు భారత భూభాగంలోకి అడుగుపెట్టాడు. దీంతో లెఫ్ట్ నెంట్ అధికారి బిరోల్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే చైనా మేజర్ మూతిపై ఒక్క గుద్దు గుద్దాడు. దీంతో చైనా మేజర్ ముక్కు పగిలి రక్తం కారింది. భారత సైనికుల దాడితో చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయని సమాచారం. వెనక్కి తగ్గకుంటే ప్రాణాలు పోతాయని భావించిన చైనా మేజర్ వెనక్కి వెళ్లియాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పది రోజుల కిందట ఈ సంఘటన జరిగినట్లు జాతీయ మీడియా చెబుతోంది.