Begin typing your search above and press return to search.

రూ.కోట్లు పెట్టి కొంటే.. కొంపముంచుతున్నారు..!

By:  Tupaki Desk   |   22 Oct 2020 8:00 AM IST
రూ.కోట్లు పెట్టి కొంటే.. కొంపముంచుతున్నారు..!
X
ఐపీఎల్ 2020 రోజురోజుకు హీట్​ పెంచుతోంది. కొంతమంది యువ బౌలర్లు, బ్యాట్స్​మెన్లు, ఫీల్డర్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే కోట్లు పెట్టి కొన్న కొందరు ప్లేయర్లు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడక తీవ్ర నిరాశ పరుస్తున్నారు. పాడిక్కల్, తెవాటియా, నికోలస్​ పూరన్​, రబడా వంటి యువ ఆటగాళ్లు ఈ సారి బాగా రాణించారు. కొందరు క్రికెటర్లు మాత్రం ప్రాంచైజ్‌లకు తీవ్ర నిరాశను మిగులుస్తున్నారు. ఐపీఎల్ 2020లో కోట్లు పెట్టి కొనుక్కొన్న కొందరు ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంది.

రికార్డు రేటు పెట్టినా కమ్మిన్స్ ప్లాప్

ఈ సారి పాట్ కమ్మిన్స్ పూర్​ పర్ఫామెన్స్​ ఇచ్చాడు.
అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం 15.5 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్​ చరిత్రలో విదేశీ ఆటగాళ్లకు చెల్లించిన దాంతో పోలిస్తే ఇది రికార్డ్​ ధర అని చెబుతున్నారు. అయితే కమ్మిన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో సత్తా చాటడం లేదు. టెస్టుల్లో నెంబర్‌ 1 బౌలర్‌గా ఉన్న కమిన్స్‌ ఓ మ్యాచ్‌ లో 3 ఓవర్ల లో 49 పరుగులు ఇచ్చి చెత్త రికార్డు ను మూట గట్టుకున్నాడు. అయితే తర్వాత పోను పోనూ కాస్త మెరుగ్గా రాణించడం మొదలు పెట్టారు. 161 స్ట్రైక్ రేటుతో ఇప్పటి వరకు 126పరుగులు చేసి బ్యాటింగ్‌ లో మాత్రం కొంత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.

మ్యాక్స్​వెల్​ ఒరగబెట్టిందేమిటి?

ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా హిట్టర్ మ్యాక్స్‌వెల్‌కు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు రూ.10.75 కోట్లు పెట్టి దక్కించుకున్నది. కీలక సమయంలో మ్యాచ్​లను మలుపుతిప్పగల సత్తా ఉన్న మ్యాక్స్​వెల్​ ఈ సీజన్​లోపెద్దగా రాణించలేదు. ఆల్ రౌండర్​గా పేరున్న ఈ క్రికెటర్​ ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి అతను 61 బంతులే ఆడి.. 58పరుగులే.. చేశాడు.లీగ్​లో ఒక్క సిక్సర్​ కూడా కొట్టలేదు.

షెల్డన్ కాట్రెల్.. బిల్డప్​ బాబాయ్​

వెస్టిండీస్‌ యువ ఫాస్ట్‌బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ను ఇప్పడు సోషల్​ మీడియా అంతా బిల్డప్​ బాబాయ్​ అని పిలుస్తున్నది. వికెట్​ తీసినప్పుడు అతడు హావభావాలు, ప్రవర్తన కాస్త చిత్రంగా ఉంటుంది. కాట్రెల్​ మాజీ సైనికుడు కావడం వల్ల వికెట్​ తీసిన వెంబడే కవాతు చేసి సెల్యూట్​ చేస్తుంటాడు. భారీ అంచనాల మధ్య కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ అతడిని రూ.8.5 కోట్లు వెచ్చింది తీసుకున్నది. కానీ అతడి ఆటతీరు మాత్రం పేలవంగా ఉన్నది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లలో 6 వికెట్లే తీయగా… 8.80 ఎకానమీ తో ఈ సీజన్‌ లో విఫలం అయ్యాడు.

ఉతప్పతో ఉపయోగమెంత

ఐపీఎల్​ కెరీర్‌ లో 180కి పైగా మ్యాచ్‌ లు ఆడాడు ఉతప్ప. కానీ ఈ సీజన్​ లో మాత్రం ఇతడు ఒక్కసారి కూడా టాలెంట్​ను చూపించుకోలేదు. రాజస్థాన్ ఇతడిని వేలంలో రూ.3 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఉతప్ప ఈ 6 మ్యాచ్‌లలో కలిపి 84బంతుల్లో చేసింది 83 పరుగులే. బెంగళూరుతో మ్యాచ్‌ లో మాత్రమే 22బంతుల్లో 41పరుగులు చేశాడు. ఇలా చాలామంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను కోట్లు పెట్టి కొనుగోలు చేసినా ఆశించిన స్థాయిలో ఆడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.